Telugu Global
Cinema & Entertainment

గుడ్ లక్ సఖి మూవీ రివ్యూ

తారాగ‌ణం: కీర్తిసురేష్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు, రాహుల్ రామకృష్ణ తదిత‌రులు ద‌ర్శ‌క‌త్వం: నగేష్ కుకునూర్ స‌మ‌ర్ప‌ణ‌: దిల్ రాజు (శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌) బ్యాన‌ర్‌: వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ నిర్మాత‌: సుధీర్ చంద్ర ప‌దిరి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ సినిమాటోగ్ర‌ఫి: చిరంతాన్ దాస్ రేటింగ్: 1.5/5 ట్రయిలర్ చూసినప్పుడే అనుమానం కలిగింది. ఈరోజు థియేటర్లలో సినిమా చూసిన తర్వాత ఆ అనుమానమే నిజమైంది. గుడ్ లక్ సఖి ట్రయిలర్ లో ఏముందో, సినిమాలో కూడా […]

గుడ్ లక్ సఖి మూవీ రివ్యూ
X

తారాగ‌ణం: కీర్తిసురేష్‌, ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు, రాహుల్ రామకృష్ణ తదిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: నగేష్ కుకునూర్
స‌మ‌ర్ప‌ణ‌: దిల్ రాజు (శ్రీ వేంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌)
బ్యాన‌ర్‌: వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్
నిర్మాత‌: సుధీర్ చంద్ర ప‌దిరి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్ర‌ఫి: చిరంతాన్ దాస్
రేటింగ్: 1.5/5

ట్రయిలర్ చూసినప్పుడే అనుమానం కలిగింది. ఈరోజు థియేటర్లలో సినిమా చూసిన తర్వాత ఆ అనుమానమే నిజమైంది. గుడ్ లక్ సఖి ట్రయిలర్ లో ఏముందో, సినిమాలో కూడా అదే ఉంది. ట్రయిలర్ లో కనిపించిన నీరసం, సినిమా అంతా ఆవహించింది. ఈ సినిమానా ఇన్నాళ్లు వాయిదాలు వేసి, చివరికి అతి కష్టమ్మీద థియేటర్లలోకి తీసుకొచ్చారు అనిపిస్తుంది. నిజంగా ఓటీటీలో కూడా ఫాస్ట్ ఫార్వార్డ్ చేసి చూడదగ్గ సినిమా ఇది.

డైలీ సీరియల్స్ లో ఓ లక్షణ ఉంటుంది. 2-3 రోజులు మిస్సయినా నాలుగో రోజు సీరియల్ కు ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు. ఎందుకంటే, కథ ముందుకు సాగదు, అక్కడే ఉంటుంది. గుడ్ లక్ సఖి సినిమా కూడా అలానే ఉంటుంది. ఓ అర్థగంట అలా బయటకెళ్లి, మళ్లీ థియేటర్లలోకొచ్చి సినిమా చూసినా ఏమాత్రం మిస్సయిన ఫీలింగ్ కలిగించదు. ఈ వన్ లైన్ స్టోరీని ఇంత సేపు సాగదీసిన దర్శకుడు నగేష్ కుకునూర్ ను మెచ్చుకోవాల్సిందే.

హైదరాబాద్ బ్లూస్ లాంటి విషయం ఉన్న సినిమాను తీసిన దర్శకుడు ఇతడు. అంతేకాదు, ఇక్బాల్ లాంటి స్పోర్ట్స్ డ్రామాను తీసిన అనుభవం కూడా ఉంది. ఇలాంటి దర్శకుడు పాతికేళ్ల తర్వాత తెలుగులో సినిమా తీస్తున్నప్పుడు, పైగా స్పోర్ట్స్ డ్రామానే సెలక్ట్ చేసుకుంటున్నప్పుడు చాలా అంచనాలుంటాయి. ఆ అంచనాల్ని గుడ్ లక్ సఖి ఏ దశలోనూ అందుకోలేకపోయింది.

కథ విషయానికొస్తే, తెలంగాణ లంబాడీ తెగకు చెందిన సఖి (కీర్తిసురేష్), రాయలసీమలో సెటిల్ అవుతుంది. చిన్నప్పట్నుంచి సఖి, రాజు (ఆది పినిశెట్టి) ఫ్రెండ్స్. రాజు చిన్న చిన్న డ్రామాలు వేస్తుంటాడు. మంచి నటుడు అనే పేరు తెచ్చుకుంటాడు. మరోవైపు సఖి మాత్రం ఊరి జనాలతో బ్యాడ్ లక్ అనిపించుకుంటుంది. ఆమె ఎక్కడ అడుగుపెడితే అక్కడ నాశనం అన్నమాట. ఇంత చెడులో కూడా మంచి క్వాలిటీ ఏంటంటే.. సఖి గోలీలు బాగా ఆడుతుంది. ఆ ఊరికి షూటింగ్ కోచ్ (జగపతి బాబు) వస్తాడు. పేదవాళ్లలో ఉన్న నైపుణ్యాల్ని వెలికి తీస్తానంటాడు. సఖికి ఉన్న గోలీల టాలెంట్ ను రాజు ద్వారా తెలుకుంటాడు కోచ్. సఖిని మంచి షూటర్ గా తీర్చిదిద్దుతాడు. అయితే ఈ క్రమంలో కోచ్ తనను ప్రేమిస్తున్నాడని భ్రమ పడుతుంది సఖి. ఇలా స్పోర్ట్స్ డ్రామాలోకి లవ్ యాంగిల్ కూడా తీసుకొచ్చాడు దర్శకుడు. చివరికి సఖి జీవితం ఏమైందనేది ఈ సినిమా కథ.

పాతికేళ్ల కిందట రావాల్సిన ఈ కథను ఇప్పుడు కూడా ఆసక్తికరంగా చెప్పొచ్చు. మంచి ట్విస్టులు, మంచి ఎపిసోడ్స్ రాసుకుంటే ఈతరం కూడా కనెక్ట్ అయ్యే యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది. కానీ నగేష్ కుకునూర్ అలాంటి ప్రయత్నం చేసినట్టు ఎక్కడా కనిపించదు. సినిమా స్టార్ట్ అయిన 40 నిమిషాలకే కథ ఏంటనేది తెలియడంతో పాటు క్లైమాక్స్ కూడా తెలిసిపోతుంది. ఇంతోటిదానికి ఇక థియేటర్లలో కూర్చోవడం ఎందుకనిపిస్తుంది. అయితే అక్కడున్నది దర్శకుడు కుకునూర్, జాతీయ అవార్డ్ గ్రహీత కీర్తిసురేష్. వీళ్లిద్దరూ కలిసి ఏదో మేజిక్ చేస్తారనే ఆశ మనసులో కలుగుతుంది. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత సినిమా పరుగులు పెడుతుందని, కొత్త మెరుపులు, టిస్టులు వస్తాయని ఆశిస్తాం. కానీ సెకండాఫ్ అయిన తర్వాత, మొదటి భాగమే కొంత బెటర్ అనిపిస్తుంది. సినిమా అంత నీరసంగా సాగుతుందన్నమాట.

డైలాగ్స్, ఎపిసోడ్స్, నెరేషన్, ట్విస్టులు, పెర్ఫార్మెన్సులు, సంగీతం.. ఇలా ఏ కోణంలోనూ ఆకట్టుకోని వీక్ సినిమా ఈ బ్యాడ్ లక్ సఖి. కీర్తిసురేష్, జగపతిబాబు, ఆది పినిశెట్టి నటన ఫర్వాలేదనిపిస్తుంది తప్ప, మనసుకు హత్తుకోదు. ఇక టెక్నికల్ గా కూడా సినిమాలో ఏం లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నప్పటికీ.. ఈ కథకు అంత అక్కర్లేదనిపిస్తుంది. దేవిశ్రీప్రసాద్ మరోసారి నిరాశపరిచాడు. పాటలు, ఆర్ఆర్ రెండూ వీకే.

ఓవరాల్ గా గుడ్ లక్ సఖి సినిమా ఈ వీకెండ్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. ఓటీటీలో రావాల్సిన ఈ సినిమా థియేటర్లలోకొచ్చి బ్యాడ్ లక్ అనిపించుకుంటుంది.

First Published:  28 Jan 2022 5:50 AM GMT
Next Story