Telugu Global
Cinema & Entertainment

దిల్ రాజు వెబ్ సిరీస్

టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు, తన కెరీర్ లో తొలిసారి ఓటీటీలోకి ఎంటరవుతున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెబ్ సిరీస్ నిర్మించబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ పేరు ఏటీఎం.. అంటే ఎనీ టైమ్ మెమొరీ అని అర్థం. ఈ వెబ్ సిరీస్ కు కథను ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ అందించడం విశేషం. దిల్ రాజు వారసులు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలని భావించారు. ముందుగా వెబ్ సిరీస్ తో […]

దిల్ రాజు వెబ్ సిరీస్
X

టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న దిల్ రాజు, తన కెరీర్ లో తొలిసారి ఓటీటీలోకి ఎంటరవుతున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెబ్ సిరీస్ నిర్మించబోతున్నారు. ఈ వెబ్ సిరీస్ పేరు ఏటీఎం.. అంటే ఎనీ టైమ్ మెమొరీ అని అర్థం. ఈ వెబ్ సిరీస్ కు కథను ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్ అందించడం విశేషం.

దిల్ రాజు వారసులు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాలని భావించారు. ముందుగా వెబ్ సిరీస్ తో ఆ పని ప్రారంభించాలనుకున్నారు. అందుకే తన కూతురు కోసం దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ సెట్ చేసి పెట్టారు. హరీశ్ శంకర్ ఇచ్చిన లైన్ ను, దర్శకుడు చంద్రమోహన్, ఎపిసోడ్ల వారీగా డివైడ్ చేశాడు. ఎపిసోడ్స్ అన్నీ నచ్చడంతో ప్రాజెక్టు సెట్ అయింది.

జీ5 సంస్థతో కలిసి దిల్ రాజు ఈ వెబ్ సిరీస్ ను ప్రొడ్యూస్ చేయబోతున్నారు. త్వరలోనే ఇది సెట్స్ పైకి రాబోతోంది. ఇందులో టాలీవుడ్ కు చెందిన యంగ్ నటీనటులు కనిపించబోతున్నారు. ఈ సిరీస్ కు కాన్సెప్ట్ అందించడంతో పాటు, దీనికి నిర్మాతగా కూడా వ్యవహరించబోతున్నాడు హరీశ్ శంకర్.

First Published:  27 Jan 2022 7:25 AM GMT
Next Story