Telugu Global
NEWS

కొత్త జిల్లాలకోసం భారీ కసరత్తు..

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం లోతైన అధ్యయనం జరిగిందని ఏపీ ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్‌ కుమార్‌ తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాల సరిహద్దులు ఎలా ఉండాలనే దానిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. భౌగోళిక అంశాలు, రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల ఆధారంగా పరిశీలన జరిగిందన్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల ప్రకారం 25 జిల్లాలు కాకుండా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా 26 జిల్లాలు చేయాలని […]

కొత్త జిల్లాలకోసం భారీ కసరత్తు..
X

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం లోతైన అధ్యయనం జరిగిందని ఏపీ ప్రణాళిక విభాగం కార్యదర్శి విజయ్‌ కుమార్‌ తెలిపారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాల సరిహద్దులు ఎలా ఉండాలనే దానిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. భౌగోళిక అంశాలు, రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల ఆధారంగా పరిశీలన జరిగిందన్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల ప్రకారం 25 జిల్లాలు కాకుండా భౌగోళిక పరిస్థితుల ఆధారంగా 26 జిల్లాలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించామన్నారాయన. ప్రజల మనోభావాలు పరిగణలోకి తీసుకుని, చారిత్రక నేపథ్యాలను అధ్యయనం చేశామని, ప్రతి జిల్లాకు రెండు రెవెన్యూ డివిజన్లను ప్రతిపాదించామని విజయ్‌ కుమార్‌ తెలిపారు.

అసెంబ్లీ నియోజకవర్గాలను విడదీయలేదు..
అసెంబ్లీ నియోజకవర్గాన్ని విడదీయకుండా జిల్లాల ఏర్పాటు, జిల్లా కేంద్రాలు అందరికీ దగ్గరుండేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు విజయ్ కుమార్. రాష్ట్రంలో గిరిజన ప్రాంతం విస్తృత పరిధిలో ఉందని, ఒకే జిల్లా ఉంటే ఇబ్బందులుంటాయని, అందుకే గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం జగన్ ఆలోచించి రెండు జిల్లాలు ఏర్పాటు చేశారని తెలిపారు. శ్రీకాకుళం పేరుతో ఉన్న విద్యాసంస్థలన్నీ ఎచ్చెర్లలో ఉన్నాయని, అందుకే ఎచ్చెర్లను శ్రీకాకుళం జిల్లాలో కలిపామని చెప్పారు విజయ్ కుమార్. విజయనగరం విస్తీర్ణం కోసమే రాజాంను ఆ జిల్లాలో కలిపాని, విజయనగరం అభివృద్ధి దెబ్బతినకుండా జిల్లా ఏర్పాటు చేశామని వివరించారు. భీమిలి గత ప్రాముఖ్యత దృష్య్టా రెవెన్యూ డివిజన్‌ గా ఏర్పాటు చేశామని చెప్పారు. రంపచోడవరం అభివృద్ధి కోసమే అల్లూరి జిల్లాలో కలిపామని తెలిపారు విజయ్ కుమార్.

పాలనా సౌలభ్యం కోసమే జిల్లాలు..
ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు లేకుండా జిల్లాకు కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఉండేలా విభజన చేశామని అన్నారు విజయ్ కుమార్. ప్రజల రవాణా సౌలభ్యాన్ని కూడా పరిశీలించామని పాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

First Published:  27 Jan 2022 5:53 AM GMT
Next Story