Telugu Global
Cinema & Entertainment

మరో సినిమా పూర్తిచేసిన నాని

నేచురల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తోన్న 28వ చిత్రం `అంటే సుందరానికీ..`. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని వేసవిలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ సంద‌ర్భంగా “ఈ సంవత్సరం రోలర్ కోస్టర్ చిత్రం షూటింగ్ పూర్తయింది. #అంటే సుందరానికి“ అని ప్రకటించిన నాని సెట్స్ చివరి రోజు […]

Movie title Ante Sundharaniki
X

నేచురల్ స్టార్ నాని హీరోగా న‌టిస్తోన్న 28వ చిత్రం 'అంటే సుందరానికీ..'. వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని వేసవిలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది.

ఈ సంద‌ర్భంగా “ఈ సంవత్సరం రోలర్ కోస్టర్ చిత్రం షూటింగ్ పూర్తయింది. #అంటే సుందరానికి“ అని ప్రకటించిన నాని సెట్స్ చివరి రోజు తీసిన ఒక వీడియోను సోష‌ల్‌మీడియా ద్వారా పంచుకున్నారు.

నూతన సంవత్సరం సందర్భంగా విడుద‌లైన 'అంటే సుందరానికీ..' ఫస్ట్ లుక్ లో నాని తన విలక్షణమైన ఫన్నీ లుక్ తో ఆశ్చర్యపరిచాడు. ఫ‌స్ట్ లుక్‌తోనే ఇదొక డిఫ‌రెంట్ మూవీ అని తెలియ‌జేశారు నాని. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో 'కస్తూరి పూర్ణ వెంకట శేష సాయి పవన రామ సుందర ప్రసాద్' అనేది నాని పాత్ర పేరు.

అంటే సుందరానికి చిత్రంతో నజ్రియా నజీమ్ ఫహద్ తెలుగులో అడుగుపెడుతోంది. ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్ కాగా.. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫ‌ర్‌. ఈ సినిమాతో ఈ ఏడాది బోణీ కొట్టాలనుకుంటున్నాడు నాని.

First Published:  24 Jan 2022 7:49 AM GMT
Next Story