Telugu Global
National

వాట్సప్, టెలిగ్రామ్ విషయంలో కేంద్రం కీలక ఆదేశాలు..

గతంలో అధికారిక పత్రాలు, సమాచార మార్పిడి అంతా ఫైళ్ల రూపంలో జరిగేది. పేపర్ పై సంతకం ఉంటేనే అది అధికారికం అయ్యేది, నేరుగా నోటీస్ చేతిలో పడితేనే అది తీసుకున్నట్టు లెక్క. ఆ తర్వాత ఈమెల్ ద్వారా సమాచార మార్పిడి వేగంగా జరిగేది. వ్యక్తిగత ఈమెయిళ్లతో ముప్పు ఉందని, అధికారిక ఈమెల్స్ వాడాలంటూ ఆ తర్వాత కాస్త హడావిడి జరిగింది. నేటి కాలంలో ఏ నోటీస్ అయినా, ఏ మీటింగ్ సమాచారం అయినా వెంటనే వాట్సప్ లో […]

వాట్సప్, టెలిగ్రామ్ విషయంలో కేంద్రం కీలక ఆదేశాలు..
X

గతంలో అధికారిక పత్రాలు, సమాచార మార్పిడి అంతా ఫైళ్ల రూపంలో జరిగేది. పేపర్ పై సంతకం ఉంటేనే అది అధికారికం అయ్యేది, నేరుగా నోటీస్ చేతిలో పడితేనే అది తీసుకున్నట్టు లెక్క. ఆ తర్వాత ఈమెల్ ద్వారా సమాచార మార్పిడి వేగంగా జరిగేది. వ్యక్తిగత ఈమెయిళ్లతో ముప్పు ఉందని, అధికారిక ఈమెల్స్ వాడాలంటూ ఆ తర్వాత కాస్త హడావిడి జరిగింది. నేటి కాలంలో ఏ నోటీస్ అయినా, ఏ మీటింగ్ సమాచారం అయినా వెంటనే వాట్సప్ లో కనపడుతోంది. వాట్సప్, లేదా టెలిగ్రామ్ గ్రూపుల్లోనే అధికారిక సమాచారం అంతా ఒకరినుంచి ఒకరికి వెళ్లిపోతోంది. అదే సమయంలో కీలక పత్రాలు, సమాచారానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా వాట్సప్ లో షేర్ చేసుకుంటున్నారు అధికారులు. కానీ ఇది ఎంతవరకు సురక్షితం అనేది ప్రశ్నార్థకం.

వాట్సప్, టెలిగ్రామ్ ఇతర సోషల్ మీడియా నెట్ వర్క్ ల సర్వర్లు ఇక్కడ ఉండవు, వాటి నిర్వాహకులతో మనకి నేరుగా సంబంధాలు ఉండవు, అలాంటప్పుడు అధికారిక పత్రాలు దుర్వినియోగం అయితే బాధ్యులెవరు..? అందుకే కేంద్రం కొత్త నిర్ణయం తీసుకుంది. ఇక వాట్సప్‌, టెలిగ్రామ్ వంటి సోష‌ల్ మీడియా యాప్‌ లలో కీల‌క స‌మాచారం, ప‌త్రాలను పంపించడం సుర‌క్షితం కాద‌ని అధికారుల‌కు కేంద్రం స్ప‌ష్టం చేసింది. ముఖ్య‌మైన డేటా షేర్ చేయ‌డానికి వాట్సాప్‌, టెలిగ్రామ్ యాప్‌ ల‌ను అస‌లు వాడొద్ద‌ని ఆదేశించింది. ఈ మేర‌కు నూతన మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. వాట్సప్‌, టెలిగ్రామ్ త‌దిత‌ర‌ సోషల్ మీడియా యాప్‌ ల సర్వర్లు ప్రైవేట్ సంస్థల యాజమాన్యంలో ఉన్నాయని, దేశ భద్రత సమాచారాన్ని భారత వ్యతిరేక శక్తులు దుర్వినియోగం చేయవచ్చని కేంద్రం ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

రక్షణ రంగానికి చెందిన వ్యవహారాల్లో వీటిని పూర్తిగా నిషేధించారు. అదే సమయంలో ఇతర ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా సోషల్ మీడియా యాప్ లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థ‌ల‌ ఉద్యోగులు ఎక్కువగా వ‌ర్క్ ఫ్రం హోం రూపంలో సేవ‌లందిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో కీలక సమాచారాన్ని వాట్సప్ లలో ఫార్వార్డ్ చేసుకుంటుంటారు. కానీ ఇకపై ఇలా చేయొద్దని కేంద్రం ఆదేశాలిచ్చింది. వర్క్ ఫ్రం హోం సమయంలో కేంద్ర ప్రభుత్వ సాధనాల ద్వారా మాత్రమే ఒకరికొకరు కనెక్ట్ కావాలని ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులు సమాచార మార్పిడి కోసం ‘ఈ-ఆఫీస్‌ అప్లికేషన్స్‌’ను మాత్రమే ఉపయోగించాలని కోరింది. కేంద్ర‌ ప్రభుత్వ‌ రహస్య సమాచారం లీక్ కావడంతోపాటు జాతీయ కమ్యూనికేషన్ నిబంధనలు, ప్రభుత్వ ఆదేశాలను ఈ యాప్స్ ఉల్లంఘించిన ఉదాహరణలున్నాయి. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియా యాప్‌ ల‌తో అనుస‌రించాల్సిన విధివిధానాల‌పై ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు రూపొందించిన మార్గ‌ద‌ర్శ‌కాలను కేంద్రం విడుదల చేసింది. ఈ ఆదేశాలను అన్నీ శాఖల అధికారులు పాటించాలని సూచించింది. జాతీయ భద్రత‌ సమస్యలపై జ‌రిగే సమావేశాల్లో స్మార్ట్-వాచీలు, స్మార్ట్ ఫోన్లు ఉపయోగించవద్దని కేంద్రం ఉన్నతాధికారులను ఆదేశించింది. వర్చువల్ సమావేశాలు కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని తెలిపింది.

First Published:  24 Jan 2022 5:54 AM GMT
Next Story