Telugu Global
National

నెగెటివ్ అయాన్ ఆభరణాలు.. వాడొచ్చా..? లేదా..?

గతంలో బంగారు, వెండి ఆభరణాలను పెట్టుకోవడం గొప్పగా భావించేవారు. ట్రెండ్ మారే కొద్దీ.. ఇప్పుడు సరికొత్త ఆభరణాలు మార్కెట్లో కనిపిస్తున్నాయి. నెగెటివ్ అయాన్ జ్యుయెలరీ పేరుతో ఇవి మార్కెట్లో దొరుకుతున్నాయి. ముఖ్యంగా ఆన్ లైన్ లో వీటికి డిమాండ్ బాగా ఉంది. చేతి కడియాలు, ఉంగరాలు, మెడలో దండలు.. ఇలా రకరకాల రూపాల్లో వీటిని వినియోగించొచ్చు. ఉపయోగం ఏంటి..? నెగెటివ్ అయాన్ పేరుతో మార్కెట్లోకి వస్తున్న ఆభరణాలను ధరిస్తే.. ఉపయోగాలెన్నో ఉన్నాయంటూ ఆన్ లైన్లో ఊదరగొడుతుంటారు. వాటినుంచి […]

నెగెటివ్ అయాన్ ఆభరణాలు.. వాడొచ్చా..? లేదా..?
X

గతంలో బంగారు, వెండి ఆభరణాలను పెట్టుకోవడం గొప్పగా భావించేవారు. ట్రెండ్ మారే కొద్దీ.. ఇప్పుడు సరికొత్త ఆభరణాలు మార్కెట్లో కనిపిస్తున్నాయి. నెగెటివ్ అయాన్ జ్యుయెలరీ పేరుతో ఇవి మార్కెట్లో దొరుకుతున్నాయి. ముఖ్యంగా ఆన్ లైన్ లో వీటికి డిమాండ్ బాగా ఉంది. చేతి కడియాలు, ఉంగరాలు, మెడలో దండలు.. ఇలా రకరకాల రూపాల్లో వీటిని వినియోగించొచ్చు.

ఉపయోగం ఏంటి..?
నెగెటివ్ అయాన్ పేరుతో మార్కెట్లోకి వస్తున్న ఆభరణాలను ధరిస్తే.. ఉపయోగాలెన్నో ఉన్నాయంటూ ఆన్ లైన్లో ఊదరగొడుతుంటారు. వాటినుంచి సెకనుకి 20లక్షల ఆరోగ్యకరమైన నెగెటివ్ అయాన్ లు విడుదలవుతాయని, మన చుట్టూ ఉన్న పరిసరాల్లోని వస్తువులపై ఉన్న పాజిటివ్ చార్జిని అవి ప్రభావితం చేస్తాయని, తద్వారా మనకు ఎలాంటి సమస్యలు ఉండవనేది అమ్మకందారుల వాదన. ఇలా ప్రచారం చేస్తూ వాటిని విపరీతంగా అమ్మేస్తున్నారు. అగ్నిపర్వతంనుంచి విడుదలైన లావాని, ఇతర కొన్ని అరుదైన మూలకాలను ఇందులో వాడతారని కూడా ప్రచారం చేస్తుంటారు. ఉన్నతాదాయ వర్గాల వారు, రాజకీయ నాయకులు, పై స్థాయిలో ఉన్న అధికారులు.. ఎక్కువగా వీటిని వినియోగిస్తున్నారు. ఉన్నత వర్గాలను అనుకరించే మధ్యతరగతిలో కూడా ఇటీవల ఈ ట్రెండ్ బాగా పెరిగింది. ఆన్ లైన్ లో ఆఫర్లలో అందుబాటులో ఉండే ఇలాంటి వస్తువులు ఇప్పుడు పల్లెటూళ్లకు కూడా వచ్చేస్తున్నాయి.

నెగెటివ్ అయాన్లు మంచివేనా..?
నెగెటివ్ అయాన్లను విడుదల చేసే ఆభరణాల పేరుతో మార్కెట్లో లభించే వస్తువుల్లో రేడియో ధార్మిక పదార్థాలు ఉంటాయనే వాదన కూడా ఉంది. వాటి వల్ల మంచి కంటే, చెడు ఎక్కువగా జరుగుతుందని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(IAEA) చెబుతోంది. రేడియో ధార్మిక వస్తువులను దగ్గరగా ఉంచుకోవడం ప్రమాదం అని, అలాంటి వాటిని నిత్యం ధరించి ఉండటం మరింత ప్రమాదం అని అంటున్నారు శాస్త్రవేత్తలు.

లోదుస్తుల్లో కూడా రేడియో ధార్మికత..
ఇటీవల మలేసియాలోని ఓ లోదుస్తుల కంపెనీ.. తమ ఉత్పత్తులు నెగెటివ్ అయాన్లను విడుదల చేస్తాయని ప్రచాచరం చేసుకుంటోంది. ఆయా పదార్థాలను లోదుస్తుల్లో చొప్పించి వాటిని తయారు చేశామని చెబుతున్నారు అమ్మకందారులు. ఇలాంటి వింత పోకడలన్నీ ఇటీవల కాలంలో ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే నెగెటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, రేడియో ధార్మిక శక్తి పేరుతో.. జరుగుతున్న బిజినెస్ మాత్రం రోజు రోజుకీ పెరిగిపోతోంది. కస్టమర్ల బలహీనతను అడ్డు పెట్టుకుని కొన్ని కంపెనీలు నాసిరకం ఉత్పత్తులను, అసలు పనికిరాని వస్తువుల్ని కూడా ఎక్కువ ధరకు వినియోగదారులకు అంటగడుతున్నాయి.

First Published:  22 Jan 2022 11:41 PM GMT
Next Story