Telugu Global
NEWS

వలంటీర్లకు ప్రమాద బీమా.. జ‌క్కంపూడి రాజా స‌రికొత్త కార్య‌క్ర‌మం

రాష్ట్ర చరిత్రలోనే వలంటీర్లకు తొలిసారిగా ప్రమాద బీమాను అందించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.. ఈ కార్యక్రమాన్ని రాజానగరం నియోజకవర్గంలో నేడు తూర్పుగోదావరి జిల్లా కలక్టర్ చేవూరి హరికిరణ్ చేతులమీదగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభింపచేశారు. రాజానగరం నియోజకవర్గంలోని 1475 మంది వలంటీర్లకు జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా ప్రమాద బీమా అందించడం హర్షించదగ్గ విషయం అని ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను కలక్టర్ అభినందించారు. నేడు రాష్ట్రంలోనే 90 శాతం అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్న ఆదర్శ […]

వలంటీర్లకు ప్రమాద బీమా.. జ‌క్కంపూడి రాజా స‌రికొత్త కార్య‌క్ర‌మం
X

రాష్ట్ర చరిత్రలోనే వలంటీర్లకు తొలిసారిగా ప్రమాద బీమాను అందించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.. ఈ కార్యక్రమాన్ని రాజానగరం నియోజకవర్గంలో నేడు తూర్పుగోదావరి జిల్లా కలక్టర్ చేవూరి హరికిరణ్ చేతులమీదగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్రారంభింపచేశారు. రాజానగరం నియోజకవర్గంలోని 1475 మంది వలంటీర్లకు జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా ప్రమాద బీమా అందించడం హర్షించదగ్గ విషయం అని ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను కలక్టర్ అభినందించారు. నేడు రాష్ట్రంలోనే 90 శాతం అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్న ఆదర్శ నియోజకవర్గంగా రాజానగరం ఉందని కలక్టర్ తెలియచేశారు.

అభివృద్ధి పనుల అమలులో పులివెందులతో సమానంగా ఉందని ఎమ్మెల్యే సేవలను కలక్టర్ కొనియాడారు. రాష్ట్రంలో ఉన్న మిగతా నియోజకవర్గాలలోని ఎమ్మెల్యేలు కూడా జక్కంపూడి రాజా సేవలను అనుసరిస్తారని కలక్టర్ హరికిరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. వలంటీర్లు అందించే సేవలకు వారికి, వారి కుటుంబాలకు అండగా ఉండాలనే ధృడ సంకల్పంతో నా నియోజకవర్గంలోని 1475 మంది వలంటీర్లకు మూడేళ్ళ పాటు ప్రమాద బీమా అందిస్తున్నానని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఈ సందర్భంగా తెలియచేశారు.

First Published:  22 Jan 2022 8:38 PM GMT
Next Story