Telugu Global
National

భారత్ లో జ్వరం మాత్రల టర్నోవర్ వెయ్యికోట్లు.. అమ్మకాల్లో డోలో రికార్డ్..

వైద్యరంగం కరోనా ముందు, కరోనా తర్వాత అన్నంతగా మారిపోయింది. భారత్ లో కూడా ఈ మార్పు సుస్పష్టం. అందులోనూ జ్వరం మాత్రల అమ్మకాలు కరోనా తర్వాత భారీగా పెరిగిపోయాయి. 2019లో.. అంటే కొవిడ్‌కు ముందు అన్ని రకాల పారాసెట్మాల్ బ్రాండ్ల అమ్మకాలు రూ.530 కోట్లు ఉండగా, 2021లో ఇవి ఏకంగా 70% పెరిగి రూ.924 కోట్లకు చేరాయి. జ్వరం, ఒళ్లు నొప్పులను తగ్గించే పారాసెట్మాల్ మాత్రలు 1960 నుంచి మార్కెట్‌ లో ఉన్నాయి. క్రోసిన్, డోలో, కాల్పాల్ […]

భారత్ లో జ్వరం మాత్రల టర్నోవర్ వెయ్యికోట్లు.. అమ్మకాల్లో డోలో రికార్డ్..
X

వైద్యరంగం కరోనా ముందు, కరోనా తర్వాత అన్నంతగా మారిపోయింది. భారత్ లో కూడా ఈ మార్పు సుస్పష్టం. అందులోనూ జ్వరం మాత్రల అమ్మకాలు కరోనా తర్వాత భారీగా పెరిగిపోయాయి. 2019లో.. అంటే కొవిడ్‌కు ముందు అన్ని రకాల పారాసెట్మాల్ బ్రాండ్ల అమ్మకాలు రూ.530 కోట్లు ఉండగా, 2021లో ఇవి ఏకంగా 70% పెరిగి రూ.924 కోట్లకు చేరాయి. జ్వరం, ఒళ్లు నొప్పులను తగ్గించే పారాసెట్మాల్ మాత్రలు 1960 నుంచి మార్కెట్‌ లో ఉన్నాయి. క్రోసిన్, డోలో, కాల్పాల్ పేరుతో ఇవి అందుబాటులో ఉన్నాయి. కరోనా తర్వాత వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. అందుబాటు ధరలో ఉండటం మరో అదనపు ప్రయోజనం. అందుకే వీటి టర్నోవర్ ఏకంగా వెయ్యి కోట్ల రూపాయల మార్కుకి చేరువైంది.

డోలో అమ్మకాలు 350కోట్లు..
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న జ్వరం మాత్రల్లో జీఎస్కే కంపెనీకి చెందిన కాల్పాల్ మొదటి స్థానంలో ఉండేది, రెండో స్థానం డోలోది. క్రోసిన్ బ్రాండ్ ది ఆరో స్థానం. అయితే తాజా గణాంకాల ప్రకారం డోలో అన్నిటినీ అధిగమించింది. కొవిడ్‌ కు ముందు భారత్ లో ప్రతి ఏటా 7.5 కోట్ల స్ట్రిప్పుల డోలో ట్యాబ్లెట్లు అమ్ముడయ్యేవి. అంటే ఏటా 112 కోట్ల ట్యాబ్లెట్ల అమ్మకాలు జరిగేవి. 2020లో ఆ సంఖ్య 141 కోట్లకు పెరిగింది. తాజా రీసెర్చ్ ప్రకారం 2021 నవంబర్ నాటికి ఏకంగా 217 కోట్లకు పెరిగింది. అంటే రెండేళ్లలో మొత్తం 358కోట్ల డోలో ట్యాబ్లెట్లు అమ్ముడయ్యాయనమాట. డోలోని కొనడమే కాదు, వాటి ఉపయోగాలను గూగుల్ లో వెదికినవారి సంఖ్య కూడా భారీగా ఉంది. గూగుల్ సెర్చ్ లో 2020 నుంచి 2 లక్షల సెర్చ్ రిజల్ట్ ల స్థానంలో డోలో-650 ఉండటం గమనార్హం.

డోలోకి ఎందుకంత క్రేజ్..
జలుబు, జ్వరం ఉంటే సాధారణంగా పారాసెట్మాల్ ట్యాబ్లెట్లు వాడుతుంటారు. అయితే ఇవి 500ఎంజి రూపంలో ఎక్కువగా అందుబాటులో ఉండేవి. జ్వరం, తీవ్ర జ్వరం అనే స్థాయీ భేదాలు ఉంటే.. వైద్యులు 650ఎంజి పారాసెట్మాల్ మాత్రల్ని వాడాలని సూచించేవారు. ఈ క్రమంలో డోలో నేరుగా 650ఎంజి పేరుతో మార్కెట్లోకి వచ్చింది. తెలియని కారణాలతో వచ్చే జ్వరాలను తగ్గించడంలో ఇది అత్యంత ప్రభావకారి అనే ప్రచారం జరిగింది. పేరు పలకడం కూడా సులువు కావడంతో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే చాలామంది జ్వరం అంటే డోలో చాలు అనే విధంగా మారిపోయారు.

First Published:  20 Jan 2022 8:58 PM GMT
Next Story