Telugu Global
NEWS

సమ్మె సైరన్ మోగించిన ప్రభుత్వ ఉద్యోగులు..

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. ఫిబ్రవరి 5నుంచి సహాయ నిరాకరణ మొదలు పెట్టాలని, ఏడో తేదీనుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పీఆర్సీని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం.. అన్నీ కలసి పీఆర్సీ సాధన సమితి ఏర్పడింది. విజయవాడలోని ఎన్జీఓ హోం లో సమావేశమైన ఉద్యోగ సంఘాల నేతలు.. సమ్మెకు వెళ్లాలని తీర్మానించారు. ఈమేరకు ఈనెల 24న […]

సమ్మె సైరన్ మోగించిన ప్రభుత్వ ఉద్యోగులు..
X

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. ఫిబ్రవరి 5నుంచి సహాయ నిరాకరణ మొదలు పెట్టాలని, ఏడో తేదీనుంచి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పీఆర్సీని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం.. అన్నీ కలసి పీఆర్సీ సాధన సమితి ఏర్పడింది. విజయవాడలోని ఎన్జీఓ హోం లో సమావేశమైన ఉద్యోగ సంఘాల నేతలు.. సమ్మెకు వెళ్లాలని తీర్మానించారు. ఈమేరకు ఈనెల 24న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇవ్వబోతున్నారు. 14రోజుల నోటీస్ గడువు పూర్తయిన వెంటనే ఉద్యోగులు సమ్మెలోకి వెళ్తామంటున్నారు.

పాత జీతాలే ఇవ్వండి..
కొత్త పీఆర్సీతో జీతాల్లో కోత పడుతోందని, అసలు పీఆర్సీఏ వద్దని, పాత జీతాలే ఇవ్వాలని సీఎస్ సమీర్ శర్మను కోరాలని నిర్ణయించారు ఉద్యోగ సంఘాల నేతలు. ఈ నెల 23న అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఈనెల 25న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 26న అన్ని తాలూకా కేంద్రాల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇస్తారు. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు తీర్మానించాయి. ఫిబ్రవరి 3న చలో విజయవాడ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు.

ట్రెజరీ ఉద్యోగులు కూడా సమ్మెలోకి..
ట్రెజరీ ఉద్యోగులు కూడా సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. కొత్త పీఆర్సీ ప్రకారం వేతనాల బిల్లులు ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం ట్రెజరీ ఉద్యోగులను ఆదేశించింది. అయితే తాము మాత్రం బిల్లులు ప్రాసెస్ చేయలేమని, పీఆర్సీ ఉద్యమంలో పాల్గొంటామని వారు స్పష్టం చేశారు.

First Published:  21 Jan 2022 5:16 AM GMT
Next Story