Telugu Global
NEWS

ఇటు కేబినెట్ భేటీ.. అటు ఉద్యోగ సంఘాల భేటీ.. పీఆర్సీపై నేడు కీలక ఘట్టం..

పీఆర్సీతో తమకు నష్టం జరుగుతోందంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు కలెక్టరేట్ల వద్ద చేపట్టిన ఆందోళన కార్యక్రమాలతో ఆ వ్యవహారం హైలెట్ గా మారింది. మరోవైపు మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సహా మరికొందరు నేతలు.. ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే అనుకున్న స్థాయిలో పీఆర్సీ పెంపు లేదని, ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కోరారు. ఎవరి ట్రాప్ లోనూ పడొద్దని సూచించారు. అదే […]

ఇటు కేబినెట్ భేటీ.. అటు ఉద్యోగ సంఘాల భేటీ.. పీఆర్సీపై నేడు కీలక ఘట్టం..
X

పీఆర్సీతో తమకు నష్టం జరుగుతోందంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు కలెక్టరేట్ల వద్ద చేపట్టిన ఆందోళన కార్యక్రమాలతో ఆ వ్యవహారం హైలెట్ గా మారింది. మరోవైపు మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సహా మరికొందరు నేతలు.. ఉద్యోగ సంఘాలు సంయమనం పాటించాలని సూచించారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే అనుకున్న స్థాయిలో పీఆర్సీ పెంపు లేదని, ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కోరారు. ఎవరి ట్రాప్ లోనూ పడొద్దని సూచించారు. అదే సమయంలో ఉద్యోగ సంఘాలకు మద్దతుగా ఉంటామని ప్రతిపక్షాలు కూడా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలన్నీ నేడు ఐక్య కార్యాచరణ ప్రకటించే అవకాశముంది. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలు ఈరోజు భేటీ కాబోతున్నారు. సమ్మె నోటీసు ఇప్పటికే సిద్ధం చేశారు. చీఫ్ సెక్రటరీకి సమ్మెనోటీసు ఇస్తామని ప్రకటించారు కూడా.

ఏపీ కేబినెట్ భేటీ..
మరోవైపు ఏపీ కేబినెట్ ఈరోజు భేటీ కాబోతోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. సినిమా టికెట్ల వ్యవహారంపై ఇటీవల చిరంజీవి, సీఎం జగన్ ని కలిసిన తర్వాత.. దీనిపై కీలక నిర్ణయం కూడా ఈరోజు వెలువడుతుందని తెలుస్తోంది. పీఆర్సీ విషయంలో జరుగుతున్న గొడవపై కూడా కేబినెట్ దృష్టిపెట్టే అవకాశముంది. ఉద్యోగులు సమ్మె నోటీసుకి సిద్ధమైన నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

సామరస్య పరిష్కారం లభిస్తుందా..?
ఇటీవల పీఆర్సీ విషయంలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రతినిధుల చర్చోప చర్చల అనంతరం చివరిగా సీఎంతో భేటీ తర్వాత ఉద్యోగులంతా పీఆర్సీకి అంగీకరించారు. అయితే ఆ తర్వాత హెచ్ఆర్ఏ తగ్గిస్తూ జీవో రావడం, జీతంలో పెంపు అంతంతమాత్రమేననే అనుమానాలు రావడంతో ఉద్యోగులు ఉద్యమబాట పట్టారు. ఇటీవల సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ వ్యవహారంలో చెలరేగిన వేడి కూడా ఎలాంటి హామీ లేకుండానే వెంటనే చల్లారింది. ఇప్పుడు ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం కచ్చితంగా ఏదో ఒక హామీ ఇచ్చి తీరాల్సిన పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిస్తున్న నేపథ్యంలో చర్చలకు ప్రభుత్వం సిద్ధమవుతుందా, లేక పీఆర్సీపై తమ నిర్ణయానికే కట్టుబడి ఉంటుందా అనే విషయంపై ఈరోజు క్లారిటీ వస్తుంది.

First Published:  20 Jan 2022 9:36 PM GMT
Next Story