Telugu Global
National

మొదలైన 5జి సేవలు.. ఆగిపోయిన విమానాలు..

అనుకున్నంతా అయింది, అటు 5జి టెక్నాలజీ మొదలైనే రోజే ఇటు అమెరికా వ్యాప్తంగా 538 విమాన సర్వీసులు నిలిచిపోయాయి. 5జి ని ఓ విప్లవంగా భావిస్తున్నా.. దాని వల్ల అనర్థాలున్నాయని, కొన్నిరోజులపాటు ఆపేయాలని.. ముఖ్యంగా విమానయాన సంస్థలు ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. కానీ అది కుదరకపోవడంతో తాజాగా 5జి సేవలు అమెరికాలో మొదలయ్యాయి. దీంతో విమాన సర్వీసుల్ని ఆయా సంస్థలు నిలిపివేశాయి. సమస్య ఏంటి..? మొబైల్ సేవలు, ఇంటర్నెట్ సేవల రంగంలో మరో విప్లవంగా భావిస్తున్న 5-జి టెక్నాలజీని […]

మొదలైన 5జి సేవలు.. ఆగిపోయిన విమానాలు..
X

అనుకున్నంతా అయింది, అటు 5జి టెక్నాలజీ మొదలైనే రోజే ఇటు అమెరికా వ్యాప్తంగా 538 విమాన సర్వీసులు నిలిచిపోయాయి. 5జి ని ఓ విప్లవంగా భావిస్తున్నా.. దాని వల్ల అనర్థాలున్నాయని, కొన్నిరోజులపాటు ఆపేయాలని.. ముఖ్యంగా విమానయాన సంస్థలు ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. కానీ అది కుదరకపోవడంతో తాజాగా 5జి సేవలు అమెరికాలో మొదలయ్యాయి. దీంతో విమాన సర్వీసుల్ని ఆయా సంస్థలు నిలిపివేశాయి.

సమస్య ఏంటి..?
మొబైల్ సేవలు, ఇంటర్నెట్ సేవల రంగంలో మరో విప్లవంగా భావిస్తున్న 5-జి టెక్నాలజీని ముందుగా అమెరికాలో అందుబాటులోకి తెచ్చారు. అయితే 5జి సర్వీసుల్లో ఉపయోగించే ఫ్రీక్వెన్సీ.. విమానాల్లోని రేడియో అల్టీమీటర్లలో కూడా ఉంటుంది. దీంతో 5జి మొదలైతే.. విమానాల అల్టీమీటర్లలో సమస్యలు తలెత్తుతాయని, ఇది విమానాల రాకపోకలపై ప్రభావం చూపిస్తుందనే అనుమానాలున్నాయి. విమాన రంగంపై వ్యతిరేక ఫలితాలుంటాయనే భయం కూడా ఉంది. ఇవి వట్టి అపోహలేనంటూ అమెరికాలో 5జి సర్వీసుల్ని ప్రారంభించిన ఎటి అంట్ టి, వెరిజాన్ టెలికం సంస్థలు కొట్టిపారేసినా.. ప్రయాణికుల ప్రాణాలకు సంబంధించిన విషయం కావడంతో విమానయాన సంస్థలు వెనకడుగు వేశాయి. 5జి సర్వీసుల వల్ల విమానాల అల్టీమీటర్లు పనిచేయకుండా పోయి, ప్రమాదాలు జరుగుతాయనే భయాలు వ్యక్తం చేస్తూ తమ సర్వీసులు రద్దు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోని కొన్ని ఎయిర్‌ పోర్టుల చుట్టూ 5జి సర్వీసుల ప్రారంభాన్ని ఎటి అండ్ టి, వెరిజాన్‌ టెలికం సంస్థలు తాత్కాలికంగా నిలిపేశాయి.

అమెరికా నుంచి బయటకు వెళ్లాల్సిన, అమెరికాకు రావాల్సిన మొత్తం 538 విమానాలు 5జి సేవల ప్రారంభం వల్ల రద్దు అయ్యాయి. ఎమిరేట్స్, ఎయిరిండియా, ఏఎన్ఏ, జపాన్ ఎయిర్‌ లైన్స్‌ కు సంబంధించిన విమానాలు తమ షెడ్యూల్స్ క్యాన్సిల్ చేశాయి. భారత్ నుంచి అమెరికా వెళ్లే విమానాలను ఎయిరిండియా రద్దు చేయడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఢిల్లీ నుంచి అమెరికా వెళ్లాల్సిన నాలుగు విమానాలను ఎయిరిండియా రద్దు చేసింది. ఈ విషయం తెలియక హైదరాబాద్ నుంచి ఢిల్లీ మీదుగా అమెరికా వెళ్లాల్సిన ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకుని వేచి చూస్తున్నారు. తీరా విమాన సర్వీసు రద్దయిందని తెలుసుకుని షాకయ్యారు. విమానయాన సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విమానాల రద్దు ఎన్నిరోజులు అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతున్న సందర్భంలో, 5జి సర్వీసుల విషయంలో అమెరికా ప్రభుత్వం త్వరగా సరైన నిర్ణయం తీసుకోవాలని ఇతర దేశాలు కోరుతున్నాయి.

First Published:  19 Jan 2022 10:50 PM GMT
Next Story