Telugu Global
National

కొవిడ్ చికిత్సలో స్టెరాయిడ్స్ వద్దు.. కేంద్రం మార్గదర్శకాలు..

కరోనా రోగులకు అవసరం లేకుండా స్టెరాయిడ్స్ ఇవ్వొద్దని కేంద్రం పేర్కొంది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. స్టెరాయిడ్స్‌ వినియోగం వల్ల బ్లాక్‌ ఫంగస్‌ వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం పెరుగుతుందని పేర్కొంది. తీవ్ర లక్షణాలు ఉన్న రోగులకు, మూత్రపిండాలు లేదా కాలేయం పనితీరులో ఇబ్బందులు లేని రోగులకు రెమిడిసివిర్ ని వినియోగించ వచ్చని తెలిపింది. అయితే ఆక్సిజన్‌ సపోర్టుపై ఉన్నవారికి మాత్రమే ఇలాంటి మందులు వాడాలని చెప్పింది. హోమ్ ఐసొలేషన్‌ […]

కొవిడ్ చికిత్సలో స్టెరాయిడ్స్ వద్దు.. కేంద్రం మార్గదర్శకాలు..
X

కరోనా రోగులకు అవసరం లేకుండా స్టెరాయిడ్స్ ఇవ్వొద్దని కేంద్రం పేర్కొంది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. స్టెరాయిడ్స్‌ వినియోగం వల్ల బ్లాక్‌ ఫంగస్‌ వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం పెరుగుతుందని పేర్కొంది. తీవ్ర లక్షణాలు ఉన్న రోగులకు, మూత్రపిండాలు లేదా కాలేయం పనితీరులో ఇబ్బందులు లేని రోగులకు రెమిడిసివిర్ ని వినియోగించ వచ్చని తెలిపింది. అయితే ఆక్సిజన్‌ సపోర్టుపై ఉన్నవారికి మాత్రమే ఇలాంటి మందులు వాడాలని చెప్పింది. హోమ్ ఐసొలేషన్‌ లో ఉన్న వారికి ఈ డ్రగ్స్‌ సూచించవద్దని స్పష్టం చేసింది. తీవ్ర లక్షణాలున్నవారికి, ఐసీయూలో చేరిన 24 నుంచి 48 గంటల్లోగా టొసిలిజుమాబ్‌ డ్రగ్స్‌ ఇవ్వొచ్చని నూతన మార్గదర్శకాల్లో పేర్కొంది.

పరీక్షలు పెంచాల్సిందే..
పలు రాష్ట్రాలలో కరోనా పరీక్షలు తగ్గడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. టెస్టుల సంఖ్యను పెంచాలని కోరింది. రెండు, మూడు వారాల కంటే ఎక్కువ రోజులు దగ్గు కొనసాగితే కొవిడ్‌ రోగులు, టీబీ(క్షయవ్యాధి), ఇతర పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. సెకండ్ వేవ్ లో స్టెరాయిడ్స్ విచ్చలవిడిగా వాడారని, దాని వల్ల ఇతర అనర్థాలు మొదలయ్యాయని, థర్డ్ వేవ్ లో అత్యవసరం అనుకుంటేనే స్టెరాయిడ్స్ ఇవ్వాలని వైద్యులకు సూచిస్తోంది కేంద్రం.

చిన్నారుల టీకాలపై క్లారిటీ లేదు..
12 ఏళ్లు పైబడిన చిన్నారులకు కూడా త్వరలో టీకాలు ఇవ్వబోతున్నట్టు ఇటీవల ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని కేంద్రం స్పష్టం చేసింది. 12 నుంచి 14 ఏండ్ల మధ్య వయసున్న పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతానికి 15ఏళ్లు పైబడినవారికి మాత్రమే భారత్ లో వ్యాక్సినేషన్ అమలవుతోంది. పాజిటివిటీ రేటు 14.43 శాతంగా ఉండటంతో.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.

First Published:  18 Jan 2022 9:21 PM GMT
Next Story