Telugu Global
National

భారత్ లో టీకా పంపిణీకి ఏడాది.. 156 కోట్ల డోసులు పూర్తి..

భారత్ లో కొవిడ్ టీకా పంపిణీ మొదలై ఏడాది పూర్తయింది. ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 156.79కోట్ల డోసుల పంపిణీ పూర్తి కావడం విశేషం. ఏడాదిలోగా అర్హులందరికీ టీకా పంపిణీ పూర్తవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇప్పటి వరకు 156కోట్లకు పైగా డోసులు ఇవ్వగలిగారు. 62 కోట్ల మంది జనాభాకు మాత్రమే 2 డోసుల టీకా పంపిణీ పూర్తయింది. భారత్ లో 2021, జ‌న‌వ‌రి 16న టీకా పంపిణీ ప్ర‌క్రియ ప్రారంభమైంది. ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు, ఫ్రంట్ లైన్ […]

భారత్ లో టీకా పంపిణీకి ఏడాది.. 156 కోట్ల డోసులు పూర్తి..
X

భారత్ లో కొవిడ్ టీకా పంపిణీ మొదలై ఏడాది పూర్తయింది. ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 156.79కోట్ల డోసుల పంపిణీ పూర్తి కావడం విశేషం. ఏడాదిలోగా అర్హులందరికీ టీకా పంపిణీ పూర్తవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇప్పటి వరకు 156కోట్లకు పైగా డోసులు ఇవ్వగలిగారు. 62 కోట్ల మంది జనాభాకు మాత్రమే 2 డోసుల టీకా పంపిణీ పూర్తయింది.

భారత్ లో 2021, జ‌న‌వ‌రి 16న టీకా పంపిణీ ప్ర‌క్రియ ప్రారంభమైంది. ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు, ఫ్రంట్ లైన్ వారియ‌ర్ల‌కు జ‌న‌వ‌రి 16న టీకా పంపిణీ ప్రారంభించ‌గా, ఫిబ్రవరి 19 నాటికి కోటి డోసుల పంపిణీ పూర్తయింది. మార్చి 1 నుంచి వృద్ధులు, దీర్ఘ‌కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సినేష‌న్ అందించారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏండ్లు పైబ‌డిన అంద‌రికీ టీకా వేయడం మొదలు పెట్టారు. మే 1 నుంచి 18 ఏండ్లు నిండిన వారంద‌రికీ వ్యాక్సిన్లు అందించ‌డం ప్రారంభించారు. 2022 జనవరి 3 నుంచి 15 -18 ఏండ్ల వ‌య‌సున్న పిల్ల‌ల‌కు టీకాలు వేస్తున్నారు. ఇక ఈ నెల 10వ తేదీ నుంచి వృద్ధుల‌కు, ఫ్రంట్ లైన్ వారియ‌ర్ల‌కు ప్రికాషనరీ డోస్ (మూడో డోస్) అందిస్తున్నారు. ఇప్పటి వరకు 42 లక్షల మంది టీనేజర్లకు వ్యాక్సిన్ అందించారు.

మొదట్లో వ్యాక్సిన్ పై అపోహలు ఉన్నాయి. ఆ తర్వాత ప్రజలు టీకా వేయించుకోడానికి ఉత్సాహం చూపించగా.. ఓ దశలో వ్యాక్సిన్లకు కొరత వచ్చింది. తీరా ఇప్పుడు వ్యాక్సిన్ల టార్గెట్ పూర్తి చేయడానికి అధికారులు కష్టపడుతున్నారు.

కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి.. కానీ..!
థర్డ్ వేవ్ మొదలైనప్పటినుంచి భారత్ లో రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే 2 రోజులుగా పెరుగుదల స్వల్పంగా కనిపిస్తోంది. తాజాగా రోజువారీ కేసుల సంఖ్య 2,71,202గా నమోదైంది. గడచిన 24 గంటల్లో 16.65 లక్షల మందికి పరీక్షలు నిర్వహించగా.. 2,71,202 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఒకరోజు వ్యవధిలో 314 మంది మృతి చెందారు. రోజువారీ పాజిటివిటీ రేటు నిన్నటితో పోల్చితే స్వల్పంగా తగ్గి 16.28 శాతానికి చేరింది. ఒమిక్రాన్ కేసుల సంఖ్య 7743కు చేరుకుంది. ఈ కేసుల్లో 28.17 శాతం పెరుగుదల నమోదు కావడం గమనార్హం.

దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 15.50 లక్షలు దాటాయి. క్రియాశీల కేసుల రేటు 4.18 శాతానికి చేరుకుంది. గత 24 గంటల వ్యవధిలో 1.38 లక్షలకుపైగా రోగులు కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 94.51 శాతానికి తగ్గింది.

First Published:  16 Jan 2022 3:41 AM GMT
Next Story