Telugu Global
National

ఎలక్ట్రిక్ వాహనాల పెంపుకోసం ఢిల్లీ ప్రభుత్వ వినూత్న విధానం..

ఎలక్ట్రిక్ వాహనాల మెయింటెనెన్స్ తక్కువేనని చెబుతున్నా, వాటి ఖరీదు కాస్త ఎక్కువ. అందులోనూ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరికీ నమ్మకం ఇంకా కుదరలేదు. అందుకే ఎలక్ట్రిక్ వాహనాల లభ్యత ఎక్కువగా ఉన్నా.. వాటి వినియోగం అనుకున్న స్థాయిలో పెరగలేదు. దీనికి విరుగుడుగా ఢిల్లీ ప్రభుత్వం కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. మూడు నెలల్లోగా 10శాతం ఎలక్ట్రటిక్ వాహనాలను సమకూర్చుకోవాలని వాహనాలను అద్దెకిచ్చే సంస్థలకు, ఫుడ్ డెలివరీ సంస్థలకు ఆదేశాలిచ్చింది. మూడు నెలల […]

ఎలక్ట్రిక్ వాహనాల పెంపుకోసం ఢిల్లీ ప్రభుత్వ వినూత్న విధానం..
X

ఎలక్ట్రిక్ వాహనాల మెయింటెనెన్స్ తక్కువేనని చెబుతున్నా, వాటి ఖరీదు కాస్త ఎక్కువ. అందులోనూ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరికీ నమ్మకం ఇంకా కుదరలేదు. అందుకే ఎలక్ట్రిక్ వాహనాల లభ్యత ఎక్కువగా ఉన్నా.. వాటి వినియోగం అనుకున్న స్థాయిలో పెరగలేదు. దీనికి విరుగుడుగా ఢిల్లీ ప్రభుత్వం కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. మూడు నెలల్లోగా 10శాతం ఎలక్ట్రటిక్ వాహనాలను సమకూర్చుకోవాలని వాహనాలను అద్దెకిచ్చే సంస్థలకు, ఫుడ్ డెలివరీ సంస్థలకు ఆదేశాలిచ్చింది.

మూడు నెలల టార్గెట్..
వాహనాలను అద్దెకిచ్చే సంస్థలు, స్కూటర్, కార్ క్యాబ్ సర్వీసులు నడిపే సంస్థలకు ముందుగా టార్గెట్ విధించింది ఢిల్లీ ప్రభుత్వం. మూడు నెలల్లోగా ఈ సంస్థలన్నీ తమ వాహనాల్లో 10శాతం టూ వీలర్లు, 5 శాతం ఫోర్ వీలర్లు కచ్చితంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉండేలా చూడాలి. అంటే కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకుని ఆ సంఖ్యను సరిపోయేలా చూడాలి. 2023 చివరి నాటికి ఆయా సంస్థల్లో టూవీలర్లలో 50 శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలి. ఫోర్ వీలర్లలో 25శాతం ఎలక్ట్రిక్ వెహికల్స్ ని వినియోగించాలి. దీనికి సంబంధించిన అగ్రిగేటర్ పాలసీ డ్రాఫ్ట్ బిల్లుని రూపొందించిన ఢిల్లీ ప్రభుత్వం రెండు నెలలపాటు ప్రజల సూచనలు సలహాలు తీసుకుంటామని చెప్పింది.

కాలుష్యానికి శాశ్వత పరిష్కారం..
ఢిల్లీ చుట్టూ కమ్ముకున్న కాలుష్య మేఘాలను తొలగించడం ఎవరి వల్లా కావడంలేదు. పంట వ్యర్థాల కాల్చివేతను అడ్డుకున్నా, వాహనాలను సరి, బేసి విధానంలో బయటికొచ్చేందుకు అనుమతించినా, భారీ వాహనాలను రోడ్లపైకి రాకుండా అడ్డుకున్నా, చివరికి నిర్మాణ పనుల్ని ఆపేసినా కూడా ఫలితం అంతంతమాత్రమే. అందుకే చివరిగా వాహనాల స్వరూప స్వభావాలను మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా అద్దెకు వాహనాలు ఇచ్చే సంస్థలు, ఫుడ్ డెలివరీ సంస్థలపై ఆంక్షలు విధించింది. ఆ తర్వాత వాహనాల అమ్మకాలపై కూడా నియంత్రణ విధించే అవకాశం ఉంది. స్వచ్ఛందంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగక పోవడంతో ఇలా నిర్బంధం చేయాలని చూస్తోంది ప్రభుత్వం.

First Published:  15 Jan 2022 10:52 PM GMT
Next Story