Telugu Global
National

మంత్రులంతా ఎస్పీలోకి.. ములాయం కోడలు బీజేపీలోకి..!

ఉత్తర ప్రదేశ్ లో అధికార బీజేపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు సమాజ్ వాదీ పార్టీలోకి వలసలు వెళ్తున్న వేళ.. బీజేపీకి అపర్ణ యాదవ్ రూపంలో ఓ అస్త్రం దొరికింది. అపర్ణ యాదవ్ సమాజ్ వాదీ పార్టీనుంచి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అపర్ణ సాధారణ మహిళ కాదు, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు. ఆమె ఇప్పుడు ఎస్పీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరాలనుకోవడం సంచలనంగా మారింది. బీజేపీలో […]

మంత్రులంతా ఎస్పీలోకి.. ములాయం కోడలు బీజేపీలోకి..!
X

ఉత్తర ప్రదేశ్ లో అధికార బీజేపీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు సమాజ్ వాదీ పార్టీలోకి వలసలు వెళ్తున్న వేళ.. బీజేపీకి అపర్ణ యాదవ్ రూపంలో ఓ అస్త్రం దొరికింది. అపర్ణ యాదవ్ సమాజ్ వాదీ పార్టీనుంచి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అపర్ణ సాధారణ మహిళ కాదు, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు. ఆమె ఇప్పుడు ఎస్పీ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరాలనుకోవడం సంచలనంగా మారింది.

బీజేపీలో చేరికపై ఆ పార్టీ పెద్దలు కొద్ది రోజులుగా అపర్ణ యాదవ్‌ తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అపర్ణ యాదవ్‌కు టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ అధిష్ఠానం అంగీకరించడంతో కాషాయ కండువా కప్పుకునేందుకు ఆమె సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.

అపర్ణ యాదవ్ ములాయం సింగ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ సతీమణి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఎస్పీ టికెట్‌ పై అలహాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అపర్ణ యాదవ్ ఎస్పీలో కొనసాగుతున్నప్పటికీ పలు సందర్భాల్లో పార్టీ లైన్‌ కు విరుద్ధంగా బీజేపీకి మద్దతుగా నిలిచారు. జాతీయ పౌరసత్వ ముసాయిదా (NRC) విషయంలో బీజేపీకి మద్దతు ప్రకటించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం రూ.11 లక్షలు విరాళం కూడా ఇచ్చారు.

గతంలో సమాజ్ వాదీ పార్టీలో లుకలుకలు మొదలైనప్పుడు అపర్ణ యాదవ్ తెరపైకి వచ్చారు. అఖిలేష్.. ములాయం పెద్ద భార్య మాలతి దేవి కుమారుడు కాగా, ప్రతీక్ యాదవ్.. రెండో భార్య సాధన గుప్తాకు కలిగిన సంతానం. ప్రతీక్ యాదవ్ తొలినుంచీ రాజకీయాలకు దూరంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. కానీ ఆయన భార్య అపర్ణ రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. ఆమెకు ములాయం సోదరుడు శివపాల్ యాదవ్ అండగా ఉండటం విశేషం. గతంలో మొదలైన గొడవలు సద్దుమణిగిపోగా, పార్టీపై అఖిలేష్ పెత్తనం కొనసాగుతోంది. సడన్ గా ఇప్పుడు అపర్ణ, బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుని బావ అఖిలేష్ కి, మామ ములాయంకి షాకిచ్చారు. అయితే దీనిపై అధికారిక ప్రకట విడుదల కావాల్సి ఉంది.

First Published:  16 Jan 2022 3:55 AM GMT
Next Story