Telugu Global
Cinema & Entertainment

సంక్రాంతి బరిలో అనాథ సినిమా

ముచ్చటగా 4 కాంపౌండ్స్ కు చెందిన సినిమాలు సంక్రాంతి బరిలో థియేటర్లలోకి వచ్చాయి. ఏ కాంపౌండ్ కు చెందిన సినిమాను ఆ కాంపౌండ్ సెలబ్రిటీలు బ్రహ్మాండంగా మోస్తున్నారు. ఎటొచ్చి ఒక్క సినిమా మాత్రం అనాథగా మిగిలిపోయింది. అదే సూపర్ మచ్చి. కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన సూపర్ మచ్చి సినిమాను సంక్రాంతి బరిలో నిలిపారు. ఇందులో హీరో స్వయానా చిరంజీవి చిన్నల్లుడు. అలాంటి వ్యక్తి నటిస్తున్న సినిమాకు ప్రమోషన్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. […]

సంక్రాంతి బరిలో అనాథ సినిమా
X

ముచ్చటగా 4 కాంపౌండ్స్ కు చెందిన సినిమాలు సంక్రాంతి బరిలో థియేటర్లలోకి వచ్చాయి. ఏ కాంపౌండ్ కు చెందిన సినిమాను ఆ కాంపౌండ్ సెలబ్రిటీలు బ్రహ్మాండంగా మోస్తున్నారు. ఎటొచ్చి ఒక్క సినిమా మాత్రం అనాథగా మిగిలిపోయింది. అదే సూపర్ మచ్చి.

కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన సూపర్ మచ్చి సినిమాను సంక్రాంతి బరిలో నిలిపారు. ఇందులో హీరో స్వయానా చిరంజీవి చిన్నల్లుడు. అలాంటి వ్యక్తి నటిస్తున్న సినిమాకు ప్రమోషన్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చరణ్ నుంచి బన్నీ వరకు అంతా రంగంలోకి దిగిపోతారు. కానీ సూపర్ మచ్చి ప్రచారానికి ఒక్క మెగా హీరో కూడా రాలేదు.

బంగార్రాజు సినిమా అక్కినేని కాంపౌండ్ మూవీ. చైతూ-నాగ్ ఆ సినిమాను మోస్తున్నారు. ఇక దిల్ రాజు కాంపౌండ్ నుంచి ఆశిష్ హీరోగా వచ్చాడు. దీనికి రాజు,శిరీష్ ఎంత చేయాలో అంతా చేశారు. ప్రభాస్ నుంచి బన్నీ వరకు ఎవ్వర్నీ వదల్లేదు. ఇక హీరో అనే సినిమా కోసం ఘట్టమనేని మహేష్ రంగంలోకి దిగిపోయాడు. క్వారంటైన్ లో ఉన్నప్పటికీ తన మేనల్లుడు గల్లా అశోక్ కోసం వీడియో బైట్ ఇచ్చాడు. కానీ సూపర్ మచ్చి ప్రమోషన్ కోసం మెగా కాంపౌండ్ హీరోలెవ్వరూ బయటకు రాలేదు. అదే ఇక్కడ చర్చనీయాంశమైంది.

First Published:  15 Jan 2022 9:21 AM GMT
Next Story