Telugu Global
Cinema & Entertainment

సొంత హీరోకు హిట్ ఇవ్వలేకపోయిన దిల్ రాజు

సంక్రాంతి బరిలో బంగార్రాజుకు పోటీగా వచ్చిన మూవీ రౌడీ బాయ్స్. దిల్ రాజు సొంత సినిమా ఇది. కేవలం నిర్మించడంతో అతడి బాధ్యత తీరలేదు. తన కుటుంబానికి చెందిన వ్యక్తిని హీరోగా పరిచయం చేశారు. స్వయంగా దిల్ రాజు తమ్ముడి కొడుకు హీరోగా పరిచయమైన సినిమా ఇది. అందుకే ఈ సినిమా కోసం సర్వశక్తులు ఒడ్డారు దిల్ రాజు. కానీ ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో అందలేదు. రౌడీ బాయ్స్ సినిమాతో ఆశిష్ హీరోగా పరిచమయ్యాడు. ఈ […]

సొంత హీరోకు హిట్ ఇవ్వలేకపోయిన దిల్ రాజు
X

సంక్రాంతి బరిలో బంగార్రాజుకు పోటీగా వచ్చిన మూవీ రౌడీ బాయ్స్. దిల్ రాజు సొంత సినిమా ఇది. కేవలం నిర్మించడంతో అతడి బాధ్యత తీరలేదు. తన కుటుంబానికి చెందిన వ్యక్తిని హీరోగా పరిచయం చేశారు. స్వయంగా దిల్ రాజు తమ్ముడి కొడుకు హీరోగా పరిచయమైన సినిమా ఇది. అందుకే ఈ సినిమా కోసం సర్వశక్తులు ఒడ్డారు దిల్ రాజు. కానీ ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో అందలేదు.

రౌడీ బాయ్స్ సినిమాతో ఆశిష్ హీరోగా పరిచమయ్యాడు. ఈ సినిమా కోసం దేవిశ్రీప్రసాద్ ను రంగంలోకి దించాడు దిల్ రాజు. ఓ మీడియం రేంజ్ సినిమాకు ఎంత ఖర్చు పెడతారో, అంతకంటే ఎక్కువే ఖర్చు పెట్టారు. అనుపమ పరమేశ్వరన్ లాంటి హీరోయిన్ ను తీసుకున్నారు. ఇక రిలీజ్ టైమ్ లో తన దగ్గరున్న థియేటర్లలో దాదాపు 80శాతం దీనికే కేటాయించారు. ప్రమోషన్ కోసం ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోలందర్నీ రంగంలోకి దించారు.

అయితే ఇంత చేసినా ఆశిష్ కు ఆశించిన విజయం దక్కలేదు. దీనికి కారణం కంటెంట్ సరిగ్గా లేకపోవడమే. శ్రీహర్ష తీసిన ఈ సినిమా కంటెంట్ మరీ రొటీన్ గా ఉంది. దీనికి తోడు రొటీన్ సన్నివేశాలు, పాటలు క్లిక్ అవ్వకపోవడం ప్రధాన బలహీనతలయ్యాయి. దీంతో రౌడీ బాయ్స్ సినిమా దిల్ రాజుకు షాకిచ్చింది. అలా తన సొంత హీరోకు హట్ ఇవ్వలేకపోయారు దిల్ రాజు.

First Published:  15 Jan 2022 9:28 AM GMT
Next Story