Telugu Global
National

కుట్ర లేదు.. సాంకేతిక లోపం కారణం కాదు..

భారత తొలి త్రివిధ దళాల అధినేత బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ నివేదిక బయటకు వచ్చింది. ఈ నివేదిక ప్రకారం వాతావరణంలో చోటుచేసుకున్న అనూహ్య మార్పుల వల్ల పైలట్‌ అయోమయానికి గురవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో ఎలాంటి కుట్రకోణంలేదని.. సాంకేతిక లోపాలు కారణం కాదని త్రివిధ దళాల కోర్టు ఆఫ్ ఎంక్వైరీ నివేదిక పేర్కొంది. ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో ఈ ఎంక్వయిరీ కమిటీ విచారణ చేపట్టింది. హెలికాప్టర్‌ ప్రమాదానికి […]

కుట్ర లేదు.. సాంకేతిక లోపం కారణం కాదు..
X

భారత తొలి త్రివిధ దళాల అధినేత బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ నివేదిక బయటకు వచ్చింది. ఈ నివేదిక ప్రకారం వాతావరణంలో చోటుచేసుకున్న అనూహ్య మార్పుల వల్ల పైలట్‌ అయోమయానికి గురవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో ఎలాంటి కుట్రకోణంలేదని.. సాంకేతిక లోపాలు కారణం కాదని త్రివిధ దళాల కోర్టు ఆఫ్ ఎంక్వైరీ నివేదిక పేర్కొంది. ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్ నేతృత్వంలో ఈ ఎంక్వయిరీ కమిటీ విచారణ చేపట్టింది. హెలికాప్టర్‌ ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాలనూ పరిశీలించి ఈ బృందం నివేదికను రూపొందించినట్టు భారత వాయుదళం పేర్కొంది. 2021, డిసెంబర్‌ 8న జరిగిన ఈ ప్రమాదంలో భారత త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులికా రావత్‌ సహా మొత్తం 14 మంది దుర్మరణం పాలైన విషయం తెలిసిందే.

లోయలోని వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల కారణంగా సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న ఎంఐ-17వీ5 హెలికాప్టర్‌ మేఘాలలో చిక్కుకున్నట్టు నివేదిక పేర్కొంది. అక్కడి పరిస్థితులతో పైలట్ అయోమయానికి గురయ్యారని, ఆ తర్వాత హెలికాఫ్టర్‌ పై నియంత్రణ కోల్పోయాడని, దీంతో ప్రమాదం జరిగిందని నివేదిక పేర్కొంది.

హెలికాఫ్టర్‌ ప్రమాదంపై నియమించిన విచారణ కమిటీ హెలికాఫ్టర్‌ డేటా రికార్డర్‌ తోపాటు, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ ను విశ్లేషించింది. అందుబాటులో ఉన్న సాక్షులందరినీ దర్యాప్తు బృందం ప్రశ్నించి వివరాలు సేకరించింది. హెలికాప్టర్ లో సాంకేతిక లోపాలేవీ లేవని నిర్థారించింది ఈ కమిటీ. అదే సమయంలో కుట్ర కోణం అంటూ వచ్చిన ఆరోపణలను కూడా ఖండించింది.

First Published:  15 Jan 2022 2:51 AM GMT
Next Story