Telugu Global
National

3 లక్షలకు చేరువవుతున్న రోజువారీ కేసులు..

భారత్ లో కరోనా వ్యాప్తి రోజు రోజుకీ భారీగా పెరిగిపోతోంది. పండగ సీజన్ కావడంతో రోజుకి సగటున 7 శాతం అదనంగా కేసులు నమోదవుతున్నాయి. ఇక కొవిడ్ పాజిటివిటీ రేటు 14.78 శాతానికి చేరడం ఆందోళన కలిగించే విషయం. గడచిన 24 గంటల్లో 17 లక్షలమందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా కొత్తగా 2,64,202 మందికి కరోనా సోకింది. 315 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 12,72,073కు చేరింది. మొత్తంగా ఇప్పటి వరకు […]

3 లక్షలకు చేరువవుతున్న రోజువారీ కేసులు..
X

భారత్ లో కరోనా వ్యాప్తి రోజు రోజుకీ భారీగా పెరిగిపోతోంది. పండగ సీజన్ కావడంతో రోజుకి సగటున 7 శాతం అదనంగా కేసులు నమోదవుతున్నాయి. ఇక కొవిడ్ పాజిటివిటీ రేటు 14.78 శాతానికి చేరడం ఆందోళన కలిగించే విషయం. గడచిన 24 గంటల్లో 17 లక్షలమందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా కొత్తగా 2,64,202 మందికి కరోనా సోకింది. 315 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 12,72,073కు చేరింది. మొత్తంగా ఇప్పటి వరకు 3.65 కోట్ల మందికి భారత్ లో వైరస్ సోకగా.. అందులో 3.48 కోట్ల మంది క్షేమంగా కోలుకున్నారు. రికవరీ రేటు 95.20శాతంగా ఉంది. కొవిడ్‌ కారణంగా ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 4,85,350కి చేరింది.

ఒమిక్రాన్ కేసుల్లో పెరుగుదల..
సాధారణ వేరియంట్ లతోపాటు.. కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కూడా భారత్ లో భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసులు దేశంలో 5,753కి పెరిగాయి. మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, కేరళలో ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది.

టీకా ప్రక్రియ వేగవంతం..
దేశంలో కరోనా టీకా కార్యక్రమం వేగం పుంజుకుంది. నిన్న ఒక్కరోజే 73 లక్షల మందికి పైగా టీకా వేశారు వైద్య సిబ్బంది. ఇప్పటి వరకూ దేశంలో రెండోడోసు వ్యాక్సినేషన్‌ 70శాతం పూర్తయిందని ప్రధాని ప్రకటించారు. దేశంలో ఇప్పటి వరకు ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ కలిపి మొత్తం 155 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. టీనేజ్ వ్యాక్సిన్ కూడా వేగం అందుకుంది. 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు వారికి 3.14 కోట్ల డోసుల టీకా పంపిణీ చేశారు. 42 శాతం మందికి తొలి డోసు టీకా పంపిణీ చేశారు. ఈనెల 10నుంచి ప్రికాషనరీ డోస్ పంపిణీ మొదలు కాగా.. అర్హులైన 33,63,635 మందికి మూడో డోసు టీకా వేశారు.

First Published:  14 Jan 2022 2:41 AM GMT
Next Story