పచ్చదనం పెరుగుదలలో ఏపీ నెంబర్-1
తరిగిపోతున్న అటవీ సంపదను కాపాడుకోడానికి, పర్యావరణ సమతుల్యతను పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు అమలులో ఉన్నాయి. అయితే వీటిని సక్రమంగా గాడిన పెట్టిన రాష్ట్రాల్లో, అద్భుత ఫలితాలు సాధించిన రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ ఉండటం విశేషం. గత రెండేళ్లలో ఏపీలో 647 చదరపు కిలోమీటర్ల మేర అటవీ భూమి విస్తరించింది. ఇండియా స్టేట్ ఆప్ ఫోర్సెట్ రిపోర్ట్ (ISFR)2021 ప్రకారం ఏపీలో అటవీ విస్తీర్ణం రెండేళ్లలో […]
తరిగిపోతున్న అటవీ సంపదను కాపాడుకోడానికి, పర్యావరణ సమతుల్యతను పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు అమలులో ఉన్నాయి. అయితే వీటిని సక్రమంగా గాడిన పెట్టిన రాష్ట్రాల్లో, అద్భుత ఫలితాలు సాధించిన రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ ఉండటం విశేషం. గత రెండేళ్లలో ఏపీలో 647 చదరపు కిలోమీటర్ల మేర అటవీ భూమి విస్తరించింది. ఇండియా స్టేట్ ఆప్ ఫోర్సెట్ రిపోర్ట్ (ISFR)2021 ప్రకారం ఏపీలో అటవీ విస్తీర్ణం రెండేళ్లలో గణనీయంగా పెరిగింది.
ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా..
కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ సర్వే జరిగింది. ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా ఏపీలో అటవీ విస్తీర్ణం పెరగడం విశేషం. ఏపీలో ప్రస్తుతం అటవీ శాఖలో 50 శాతం ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఫీల్డ లెవల్ స్టాఫ్ కొరత తీవ్రంగా ఉంది. ఒక్కో బీట్ ఆఫీసర్ 25 నుంచి 40 చదరపు కిలోమీటర్లు కవర్ చేయాల్సి ఉంటుంది. అయినా కూడా అటవీ సంపదను కాపాడటంలో సిబ్బంది పడిన కష్టానికి ఫలితం దక్కింది. ఏపీలో దట్టమైన అడవుల శాతం స్థిరంగా ఉంది, అదే సమయంలో ఓపెన్ ఫారెస్ట్ ఏరియా బాగా పెరిగింది.
తెలంగాణలో ఇలా..
తెలంగాణలో అటవీ విస్తీర్ణం రెండేళ్లలో 632 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం 2015లో చేపట్టిన హరితహారం ప్రాజెక్ట్ దీనికి కారణం అంటున్నారు అధికారులు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 241.53 కోట్ల మొక్కలు నాటారు. హరితహారం కోసం తెలంగాణ ప్రభుత్వం 8,260.76 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది.
హైదరాబాద్ టాప్..
ఇక మెగా సిటీస్ లో పచ్చదనం శాతాన్ని పరిగణలోకి తీసుకుంటే 2011 నుంచి 2021 మధ్య కాలంలో హైదరాబాద్ లో పచ్చదనం బాగా పెరిగింది. పదేళ్ల క్రితం హైదరాబాద్ లో 33.15 చదరపు కిలోమీటర్ల మేర మొక్కలు, చెట్లు ఉండగా.. 2021 నాటికి 81.81 చదరపు కిలోమీటర్ల మేర సామాజిక వనాలు పెరిగాయి. అంటే దాదాపు 147 శాతం పెరుగుదల కనిపించింది. అదే సమయంలో బెంగళూరులో సామాజిక వనాల విస్తీర్ణం 5 శాతం తగ్గడం విశేషం. అత్యథికంగా కోల్ కతాలో ఈ విస్తీర్ణం 30శాతం తగ్గింది. చెన్నైలో స్వల్పంగా పచ్చదనం 26శాతం పెరిగింది.