Telugu Global
NEWS

ఆనందయ్యకు ఆయుష్ నోటీసులు..

ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య పేరు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా మారుమోగిపోయింది. తానిచ్చే ఆయుర్వేద మందు ఒమిక్రాన్ వేరియంట్ ని కూడా సమర్ధంగా అడ్డుకుంటుందని ఇటీవల ఆనందయ్య ప్రచారం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఆనందయ్య ఇంటికి రోగుల తాకిడి పెరుగుతున్న సందర్భంలో స్థానిక పంచాయతీ కూడా ఆయనకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ఆనందయ్య తమ ఊరిలో నాటుమందు అమ్మకూడదంటూ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పంచాయతీ సభ్యులు తీర్మానం చేశారు. ఆ తర్వాత […]

ఆనందయ్యకు ఆయుష్ నోటీసులు..
X

ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య పేరు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా మారుమోగిపోయింది. తానిచ్చే ఆయుర్వేద మందు ఒమిక్రాన్ వేరియంట్ ని కూడా సమర్ధంగా అడ్డుకుంటుందని ఇటీవల ఆనందయ్య ప్రచారం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఆనందయ్య ఇంటికి రోగుల తాకిడి పెరుగుతున్న సందర్భంలో స్థానిక పంచాయతీ కూడా ఆయనకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ఆనందయ్య తమ ఊరిలో నాటుమందు అమ్మకూడదంటూ నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పంచాయతీ సభ్యులు తీర్మానం చేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్ కూడా ఆనందయ్యకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ కొత్తగా ఆనందయ్యకు ఆయుష్ విభాగం నోటీసులివ్వవడం విశేషం.

ఒమిక్రాన్ కు ఆనందయ్య మందు అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయుష్ శాఖ స్పందించింది. ఆనందయ్య మందుకి అనుమతి లేదని, మందుల తయారీకి కూడా ఆయన అనుమతి తీసుకోలేదని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. “మీరు తయారు చేసే మందుకి ఒమిక్రాన్ ను తగ్గిస్తుందనే శాస్త్రీయ ఆధారాలుంటే ఇవ్వండి” అంటూ ఆనందయ్యకు ఆయుష్ శాఖ నోటీసులిచ్చింది. ఆనందయ్య ఇస్తున్న మందుల్ని ఆయుర్వేద మందులుగా పేర్కొనడం కూడా సరికాదని తెలిపింది.

ఆయుష్ ఇమ్యూనిటీ బూస్టర్లు..
రోగ నిరోధక శక్తి పెంచే ఆయుర్వేద మందులు ఆయుష్ వద్ద ఉన్నాయని చెబుతున్నారు అధికారులు. ఇమ్యూనిటీకోసం తాము మందులు తయారు చేశామని చెబుతున్నారు. అయితే ఆనందయ్య అమ్మే మందులకు అసలు అనుమతి లేదని, మందుల తయారీకి కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు అధికారులు. ఒమిక్రాన్ మందు పేరిట ఆయుర్వేద మందుల పంపిణీ చేయకూడదని తమ నోటీసుల్లో తేల్చి చెప్పారు. ఆధారాలుంటి ఇవ్వాలని కోరారు.

First Published:  12 Jan 2022 7:33 AM GMT
Next Story