Telugu Global
NEWS

గాంధీ, ఉస్మానియా ఆస్ప‌త్రుల్లో 94 మంది వైద్యులు, సిబ్బందికి పాజిటివ్‌

కొంత గ్యాప్ త‌రువాత కొత్త పేరు పెట్టుకొని మళ్లీ మాన‌వ జీవితాల‌ను ఆగం చేసేందుకు వ‌చ్చేసింది క‌రోనా. ఫ‌స్ట్, సెకండ్ వేవ్ దెబ్బ నుంచి కోలుకోక‌ముందే ఒమిక్రాన్ రూపంలో క‌రోనా మ‌హ‌మ్మారి మళ్లీ పంజా విసురుతోంది. కొద్ది కొద్దిగా కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ ప్ర‌భుత్వం కోవిడ్ క‌ట్ట‌డి ఆంక్ష‌ల‌ను మ‌రింత క‌ఠిన త‌రం చేసింది. ఇదిలా ఉండ‌గా.. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. ప్ర‌భుత్వం ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు పాటిస్తూ.. ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం […]

గాంధీ, ఉస్మానియా ఆస్ప‌త్రుల్లో 94 మంది వైద్యులు, సిబ్బందికి పాజిటివ్‌
X

కొంత గ్యాప్ త‌రువాత కొత్త పేరు పెట్టుకొని మళ్లీ మాన‌వ జీవితాల‌ను ఆగం చేసేందుకు వ‌చ్చేసింది క‌రోనా. ఫ‌స్ట్, సెకండ్ వేవ్ దెబ్బ నుంచి కోలుకోక‌ముందే ఒమిక్రాన్ రూపంలో క‌రోనా మ‌హ‌మ్మారి మళ్లీ పంజా విసురుతోంది. కొద్ది కొద్దిగా కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ ప్ర‌భుత్వం కోవిడ్ క‌ట్ట‌డి ఆంక్ష‌ల‌ను మ‌రింత క‌ఠిన త‌రం చేసింది.

ఇదిలా ఉండ‌గా.. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయి. ప్ర‌భుత్వం ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు పాటిస్తూ.. ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తున్న‌ప్ప‌టికీ కేసుల పెరుగుద‌ల‌లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. మామూలు ప్ర‌జ‌ల‌తో పాటు ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌ సైతం క‌రోనా బారిన‌ప‌డుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. వైద్యులు, వైద్య సిబ్బందికి కూడా మహమ్మారి వ్యాపించింది.

ఉస్మానియా, గాంధీ ఆస్ప‌త్రుల్లో క‌లిపి ఏకంగా 94 మంది వైద్యులు, సిబ్బంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. గాంధీలో 20 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు, 10 మంది పీజీ విద్యార్థులు, 4గురు బోధన సిబ్బంది, 10 మంది హౌజ్‌ సర్జన్స్‌ కోవిడ్‌ బారిన పడ్డారు. ఉస్మానియాలో 25మంది హౌస్ సర్జన్స్, 23 పీజీ స్టూడెంట్స్, ఇద్ద‌రు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

First Published:  11 Jan 2022 6:55 AM GMT
Next Story