Telugu Global
Health & Life Style

2లక్షలకు చేరువలో రోజువారీ కేసులు.. పాజిటివిటీ రేటు 13.29

భారత్ లో 100మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తే అందులో దాదాపు 13మందికి పైగా పాజిటివ్ కన్ఫామ్ అవుతోంది. పాజిటివిటీ రేటు రోజుల వ్యవధిలోనే భారీగా పెరిగిపోయింది. చాలా తక్కువ టైమ్ లోనే రోజువారీ కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఈనెల 7వతేదీ రోజువారీ కేసుల సంఖ్య లక్ష దాటింది. సరిగ్గా మూడు రోజులకే ఆ సంఖ్య రెట్టింపు దగ్గరికి వచ్చింది. రోజుకి రెండు లక్షల కేసులంటే పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టే లెక్క. డిసెంబర్ చివరి నుంచి ఒమిక్రాన్ భయాలు […]

2లక్షలకు చేరువలో రోజువారీ కేసులు.. పాజిటివిటీ రేటు 13.29
X

భారత్ లో 100మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తే అందులో దాదాపు 13మందికి పైగా పాజిటివ్ కన్ఫామ్ అవుతోంది. పాజిటివిటీ రేటు రోజుల వ్యవధిలోనే భారీగా పెరిగిపోయింది. చాలా తక్కువ టైమ్ లోనే రోజువారీ కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఈనెల 7వతేదీ రోజువారీ కేసుల సంఖ్య లక్ష దాటింది. సరిగ్గా మూడు రోజులకే ఆ సంఖ్య రెట్టింపు దగ్గరికి వచ్చింది. రోజుకి రెండు లక్షల కేసులంటే పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టే లెక్క.

డిసెంబర్ చివరి నుంచి ఒమిక్రాన్ భయాలు పెరిగాయి, కరోనా కేసుల సంఖ్య కూడా పెరిగింది. ఒమిక్రాన్ వేరియంట్ తోపాటే, డెల్టా వేరియంట్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతూ వస్తోంది. దాదాపుగా థర్డ్ వేవ్ వచ్చేసినట్టే లెక్క వేస్తున్నారు వైద్య నిపుణులు. జనవరి చివరి నాటకి, లేదా ఫిబ్రవరిలో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ కి వెళ్తుందని అంటున్నారు. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు అమలులోకి వచ్చేశాయి, నైట్ కర్ఫ్యూలు పెడుతున్నారు. స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. అయినా కూడా కేసులు అదుపులోకి రాకపోవడంతో పరిస్థితి చేయిదాటుతోందని భయపడుతున్నాయి ప్రభుత్వాలు. పండగల సీజన్లో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు.

వ్యాప్తి ఎక్కువ..
కొవిడ్ ఇతర వేరియంట్ల కంటే ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వెలుగు చూసిన కరోనా కేసులన్నిటినీ ఒమిక్రాన్ గా అనుమానించలేం కానీ, విదేశీ ప్రయాణికులు, లేదా వారికి దగ్గరగా ఉన్నవారి నమూనాలను మాత్రమే ఒమిక్రాన్ టెస్ట్ కి పంపిస్తున్నారు. దీంతో అసలు ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఎంతనేదానిపై పూర్తిగా క్లారిటీ లేదు. తాజాగా దేశవ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 1,79,723 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరోజు మరణాల సంఖ్య 146. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,23,619 కరోనా యాక్టివ్‌ కేసులు ఉండగా పాజిటివిటీ రేటు 13.29 శాతంగా లెక్క తేల్చారు. ఒమిక్రాన్‌ వేరియంట్ కేసుల సంఖ్య 4,033కు చేరుకుంది. భారత్ లో ఈ రోజునుంచి ఫ్రంట్ లైన్ వారియర్స్, వృద్ధులకు ప్రికాషనరీ డోస్ పంపిణీ మొదలైంది.

First Published:  10 Jan 2022 3:00 AM GMT
Next Story