Telugu Global
International

వ్యాక్సిన్ వేసుకోకపోతే ఉద్యోగం మానేయండి.. సిటీ గ్రూప్ డెడ్ లైన్..

కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం వ్యక్తిగత బాధ్యతగా చాలామంది తీసుకున్నా.. కొంతమంది మాత్రం దాన్ని ఇంకా భారంగానే భావిస్తున్నారు. రకరకాల భయాల నేపథ్యంలో వ్యాక్సినేషన్ కి వెనకాడుతున్నారు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా కొంతమంది పౌరులు వ్యాక్సిన్ తీసుకోడానికి ముందుకు రావడంలేదు. వివిధ సంస్థల ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాం కానీ, వ్యాక్సిన్ వేసుకుని ఆఫీస్ కి మాత్రం రాలేమని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. ఈ దశలో సిటీ గ్రూప్ ఓ సంచలన నిర్ణయం […]

వ్యాక్సిన్ వేసుకోకపోతే ఉద్యోగం మానేయండి.. సిటీ గ్రూప్ డెడ్ లైన్..
X

కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం వ్యక్తిగత బాధ్యతగా చాలామంది తీసుకున్నా.. కొంతమంది మాత్రం దాన్ని ఇంకా భారంగానే భావిస్తున్నారు. రకరకాల భయాల నేపథ్యంలో వ్యాక్సినేషన్ కి వెనకాడుతున్నారు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా కొంతమంది పౌరులు వ్యాక్సిన్ తీసుకోడానికి ముందుకు రావడంలేదు. వివిధ సంస్థల ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాం కానీ, వ్యాక్సిన్ వేసుకుని ఆఫీస్ కి మాత్రం రాలేమని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు. ఈ దశలో సిటీ గ్రూప్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో వ్యాక్సిన్ వేయించుకోనివారిని ఉద్యోగం నుంచి తొలగించడానికి నిర్ణయించింది.

జనవరి 14 డెడ్ లైన్..
జనవరి 14 తర్వాత సిటీ గ్రూప్ కంపెనీలో వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులెవరూ అమెరికాలో తమ ఆఫీస్ లకి రావాల్సిన అవసరం లేదు. వారందరికీ సామూహిక సెలవలు ఇచ్చేస్తారు. అయితే ఈ సెలవల్లో వారికి జీతం ఇవ్వరు. అది కూడా జనవరి నెలాఖరు వరకు మాత్రమే గడువు. అంటే.. రెండు వారాల్లో వారు వ్యాక్సిన్ పై నిర్ణయం తీసుకోవాల్సిందే. అప్పటికీ వ్యాక్సిన్ వేసుకోకపోతే ఫిబ్రవరి 1 నుంచి వారి ఉద్యోగం ఊడినట్టే. ఈమేరకు కొత్తగా నిబంధనలు తీసుకొచ్చింది సిటీ గ్రూప్.

వర్క్ ఫ్రమ్ ఫోమ్.. టైమ్ పూర్తయిన తర్వాత చాలామంది ఆఫీస్ లకు రావాల్సిన సందర్భంలో.. సిటీ గ్రూప్ సహా చాలా సంస్థల్లో వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులు ఇంటినుంచే పని చేస్తామంటూ అభ్యర్థనలు ఇస్తున్నారు. అయితే సిటీ గ్రూప్ మాత్రం ఓ అడుగు ముందుకేసింది. వ్యాక్సిన్ వేయించుకోకపోతే ఏకంగా ఉద్యోగంనుంచే తీసేస్తామని ప్రకటించింది. అంతే కాదు, ఏడాది చివర్లో ఇచ్చే బోనస్ విషయంలో కూడా కండిషన్లు పెట్టింది. 2 డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నవారికి మాత్రమే బోనస్ ఇస్తామని, ఈ విషయంపై ఎవరూ కోర్టులని ఆశ్రయించే వీలు లేదని కూడా ఉద్యోగులకు నోటీసులిచ్చింది. 70వేలమంది ఉద్యోగులు ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నా.. ఓ పదిశాతం మంది మాత్రం ఇంకా వెనకాడుతున్నారు. అలాంటి వారందరికీ ఇప్పుడు సిటీ గ్రూప్ షాకిచ్చింది. ఇదే బాటలో మరిన్ని కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు వ్యాక్సిన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకోబోతున్నాయి.

First Published:  7 Jan 2022 9:43 PM GMT
Next Story