Telugu Global
Cinema & Entertainment

నాగ్ తో అందుకే పాట పాడించాడట

బంగార్రాజులో నాగార్జున పాట పాడిన సంగతి తెలిసిందే. లిరికల్ వీడియోస్ లో భాగంగా ఫస్ట్ ఆ పాటనే రిలీజ్ చేశారు. ఆ పాట వెనక కథను బయటపెట్టాడు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. “మనం సినిమాలో పియ్యో పియ్యోరే సాంగ్ షూట్ సమయంలో వెళ్లాను. నాగ్ సర్ పాడుతూ కనిపించారు. వాయిస్ బాగుందని ట్రై చేద్దామని చెప్పాను. కానీ అప్పుడు కుదరలేదు. అందుకే సోగ్గాడే చిన్ని నాయనలో ట్రై చేశాం. అది బాగా క్లిక్ అయింది. బంగార్రాజులో […]

నాగ్ తో అందుకే పాట పాడించాడట
X

బంగార్రాజులో నాగార్జున పాట పాడిన సంగతి తెలిసిందే. లిరికల్ వీడియోస్ లో భాగంగా ఫస్ట్ ఆ పాటనే రిలీజ్ చేశారు. ఆ పాట వెనక కథను బయటపెట్టాడు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్.

“మనం సినిమాలో పియ్యో పియ్యోరే సాంగ్ షూట్ సమయంలో వెళ్లాను. నాగ్ సర్ పాడుతూ కనిపించారు. వాయిస్ బాగుందని ట్రై చేద్దామని చెప్పాను. కానీ అప్పుడు కుదరలేదు. అందుకే సోగ్గాడే చిన్ని నాయనలో ట్రై చేశాం. అది బాగా క్లిక్ అయింది. బంగార్రాజులో కూడా సిట్యువేషన్ కుదిరింది. ముందు ఒక లైన్ మాత్రమే అనుకున్నాం. పాట విన్నాక మొత్తం పాడాలా అని నాగ్ సర్ అడిగారు. అంతకంటే కావాల్సిందేముంది, సరే అన్నాం.”

బంగార్రాజులో ఎక్కడా వెస్ట్రన్ బీట్ కనిపించదంటున్నాడు అనూప్ రూబెన్స్. కథ ప్రకారం సంగీతం ఉంటుందని, పూర్తిగా పల్లెటూరి నేపథ్యం సంగీతంలో కనిపిస్తుందని చెబుతున్నాడు.

“ఇది పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఉంటుంది. ఒక్క పాట కూడా వెస్ట్రన్ ఉండదు. అన్నీ కూడా ట్రెడిషనల్‌గా, పల్లెటూరి వాతావరణంలోనే ఉంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో కూడా వెస్ట్రన్ ఇన్‌స్ట్రూమెంట్ పరికరాలు వాడలేదు. సోగ్గాడే చిన్ని నాయనలోని ఫ్లేవర్‌ను ఇందులో కూడా కంటిన్యూ చేయాలని అనుకున్నాం.”

ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలోకి వస్తున్నాడు బంగార్రాజు. సంక్రాంతి బరిలో నిలిచిన ఒకే ఒక్క పెద్ద సినిమా ఇది. మిగతావన్నీ చిన్న సినిమాలే.

First Published:  8 Jan 2022 7:12 AM GMT
Next Story