Telugu Global
CRIME

కన్న కొడుకుపై తండ్రి లైంగిక దాడి..!

కామాంధులు చెలరేగిపోతున్నారు. వావి వరుసలు కూడా చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కన్న కూతురిపై కూడా అత్యాచారం జరుగుతున్న సంఘటనలు ఇటీవల అధికమయ్యాయి. కాగా తాజాగా కన్న కుమారుడిపై తండ్రి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది. తన భర్త నుండి తనను, తన కుమారుడిని రక్షించాలంటూ మహిళ పోలీసులను ఆశ్రయించింది. హైదరాబాద్ లోని హబ్సిగూడకు చెందిన వీణా రెడ్డికి, ఉప్పల్ కు చెందిన భరత్ రెడ్డి తో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి […]

కన్న కొడుకుపై తండ్రి లైంగిక దాడి..!
X

కామాంధులు చెలరేగిపోతున్నారు. వావి వరుసలు కూడా చూడకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కన్న కూతురిపై కూడా అత్యాచారం జరుగుతున్న సంఘటనలు ఇటీవల అధికమయ్యాయి. కాగా తాజాగా కన్న కుమారుడిపై తండ్రి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది. తన భర్త నుండి తనను, తన కుమారుడిని రక్షించాలంటూ మహిళ పోలీసులను ఆశ్రయించింది.

హైదరాబాద్ లోని హబ్సిగూడకు చెందిన వీణా రెడ్డికి, ఉప్పల్ కు చెందిన భరత్ రెడ్డి తో ఎనిమిదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. కొద్దిరోజుల కిందట వీణా రెడ్డికి, భరత్ రెడ్డి కి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. విడాకుల కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ కోర్టులో నడుస్తోంది.

ఈ వివాదం ఇలా ఉండగానే తన కుమారుడిని తనకే అప్పగించాలని భరత్ రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై విచారించిన కోర్టు వారానికి ఒక సారి కొడుకును కలుసుకోవచ్చని తీర్పు ఇచ్చింది. అయితే తన భర్త కుమారుడిని తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ వీణా రెడ్డి ఆరోపణలు చేసింది. బాబును ఇకపై భరత్ రెడ్డి వద్దకు అసలు పంపబోనని వీణా రెడ్డి తెలిపింది. భర్త నుంచి తనను, తన కుమారుడిని రక్షించాలని ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాబుకు వైద్య పరీక్షలు చేయించారు. అయితే ఈ పరీక్షల్లో బాబుపై లైంగిక దాడి జరిగినట్టు వైద్యులు కూడా నిర్ధారించారు. దీంతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కన్న కుమారుడిపై తండ్రి లైంగిక వేధింపులకు పాల్పడడంపై హైదరాబాద్ లో కలకలం రేపుతోంది.

First Published:  7 Jan 2022 1:45 AM GMT
Next Story