Telugu Global
NEWS

నాకు తెలియ‌దు, చెప్ప‌ను, స‌మ‌ర్థించ‌ను, ఖండించ‌ను " జ‌గ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల అంశం ఈనాటిది కాదు. త‌రాలుగా వ‌స్తుందే.. మ‌నం చూస్తుందే. అయితే ఆ పార్టీ డ్యామేజీ చేయ‌డానికి వేరే ఎవ‌రూ అక్క‌ర్లేదు.. కాంగ్రెస్ నేత‌లే స‌రిపోతార‌నే మాట కూడా జ‌న‌మంతా అనుకునేదే. రాజ‌కీయ పార్టీ నాయ‌కులు అన్నాక అల‌గ‌డాలు.. వారిని బుజ్జ‌గించ‌డాలు అనేవి స‌ర్వ‌సాదార‌ణం. తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం ఆ పార్టీ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. కుదిరిన చోట‌ల్లా దీక్ష‌లు, అవ‌స‌ర‌మైన చోట‌ల్లా ఆందోళ‌న‌లు చేస్తూ ఈమ‌ధ్య కాలంలో కొంత మైలేజీని మూట‌గ‌ట్టుకుంది. […]

నాకు తెలియ‌దు, చెప్ప‌ను, స‌మ‌ర్థించ‌ను, ఖండించ‌ను  జ‌గ్గారెడ్డి
X

కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల అంశం ఈనాటిది కాదు. త‌రాలుగా వ‌స్తుందే.. మ‌నం చూస్తుందే. అయితే ఆ పార్టీ డ్యామేజీ చేయ‌డానికి వేరే ఎవ‌రూ అక్క‌ర్లేదు.. కాంగ్రెస్ నేత‌లే స‌రిపోతార‌నే మాట కూడా జ‌న‌మంతా అనుకునేదే. రాజ‌కీయ పార్టీ నాయ‌కులు అన్నాక అల‌గ‌డాలు.. వారిని బుజ్జ‌గించ‌డాలు అనేవి స‌ర్వ‌సాదార‌ణం. తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం ఆ పార్టీ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. కుదిరిన చోట‌ల్లా దీక్ష‌లు, అవ‌స‌ర‌మైన చోట‌ల్లా ఆందోళ‌న‌లు చేస్తూ ఈమ‌ధ్య కాలంలో కొంత మైలేజీని మూట‌గ‌ట్టుకుంది.

ఈ ద‌శ‌లో ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి అంశం తెర‌పైకి వ‌చ్చింది. జ‌గ్గారెడ్డి పార్టీని వీడుతారంటూ, రాజీనామా చేస్తారంటూ, అధిష్టానంతో పొస‌గ‌డం లేద‌ని ఇలా ర‌క‌ర‌కాల వ‌దంతులు వ‌స్తున్న నేప‌థ్యంలో.. స్వ‌యంగా జ‌గ్గారెడ్డి మీడియా ముందుకు వ‌చ్చి త‌న వివ‌ర‌ణ సైతం వెల్ల‌బుచ్చారు.

'పీఏసీ మీటింగ్‌లో ఏం జరిగిందో చెప్పను. నా ఆవేదనను పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్‌కు చెప్పిన‌. నాపై వస్తున్న వార్తల్లో ఏది నిజం, ఏది అబద్దమో చెప్పను. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలవడానికి అపాయింట్‌మెంట్ కోర‌తా. వారి నాయ‌క‌త్వంలోనే నా జీవిత‌మంతా పనిచేస్తా. వేరే ఇత‌ర పార్టీల‌కు నేను అస‌లు పోను. పార్టీని డ్యామేజీ చేయ‌ను. నన్ను ఎవరు డ్యామేజ్ చేయాలని చూసినా పార్టీని వీడ‌ను. నా రాజీనామాపై వస్తున్న వార్తలను సమర్థించను, ఖండించను.

కాంగ్రెస్ సీనియ‌ర్ లీడర్లు వీహెచ్ హ‌నుమంత‌రావు, భట్టి విక్ర‌మార్క‌, శ్రీధర్ బాబు, మహేశ్వర్ రెడ్డి నాతోటి మాట్లాడారు. కానీ ఆ విషయాలు చెప్పను. కాంగ్రెస్ ఎవ‌రి జారిగి కాదు. సోనియా జాగిరి. ఈ నెల 20వ తేదీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది' అని జ‌గ్గారెడ్డి చెప్పారు.

First Published:  7 Jan 2022 1:03 AM GMT
Next Story