Telugu Global
National

సీఎం వర్సెస్ గవర్నర్.. తమిళనాడులో పవర్ పంచాయితీ..

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొరపొచ్చాలు వస్తే.. రాష్ట్రంలోని పార్టీలు తమ పెత్తనాన్ని పదిలపరచుకోవాలనుకుంటాయి. ఈ క్రమంలో ఇటీవల మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ లో గవర్నర్లతో ముఖ్యమంత్రులు పేచీలు పెట్టుకోవడమే దీనికి నిదర్శనం. ఇప్పుడు ఆ లిస్ట్ లో తమిళనాడు కూడా చేరబోతోంది. యూనివర్శిటీల వైస్ ఛాన్స్ లర్లను నియమించుకునే అధికారాన్ని గవర్నర్లనుంచి లాగేసుకోవాలని చూస్తోంది తమిళనాడు ప్రభుత్వం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన తీర్మానం చేసేందుకు సిద్ధమయ్యారు డీఎంకే నేతలు. ప్రస్తుతం ఆర్.ఎన్. రవి తమిళనాడు […]

సీఎం వర్సెస్ గవర్నర్.. తమిళనాడులో పవర్ పంచాయితీ..
X

కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొరపొచ్చాలు వస్తే.. రాష్ట్రంలోని పార్టీలు తమ పెత్తనాన్ని పదిలపరచుకోవాలనుకుంటాయి. ఈ క్రమంలో ఇటీవల మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ లో గవర్నర్లతో ముఖ్యమంత్రులు పేచీలు పెట్టుకోవడమే దీనికి నిదర్శనం. ఇప్పుడు ఆ లిస్ట్ లో తమిళనాడు కూడా చేరబోతోంది. యూనివర్శిటీల వైస్ ఛాన్స్ లర్లను నియమించుకునే అధికారాన్ని గవర్నర్లనుంచి లాగేసుకోవాలని చూస్తోంది తమిళనాడు ప్రభుత్వం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన తీర్మానం చేసేందుకు సిద్ధమయ్యారు డీఎంకే నేతలు. ప్రస్తుతం ఆర్.ఎన్. రవి తమిళనాడు గవర్నర్ గా ఉన్నారు.

రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీలకు గవర్నర్ ఛాన్స్ లర్ గా ఉంటారు. వైస్ ఛాన్స్ లర్ల నియామకాలు ఆయనే చేపడతారు. ఒక్కో యూనివర్శిటీకి సంబంధించి కమిటీ ఆయనకు ముగ్గురి పేర్లను సిఫారసు చేస్తుంది. ఈ కమిటీ సిఫారసులు ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా ఉంటాయి. అదే సమయంలో తుది నిర్ణయం మాత్రం గవర్నర్ దే. గవర్నర్ పూర్తిగా ఆ ముగ్గురి జాబితాను తిప్పిపంపే అవకాశం కూడా ఉంది. అలాంటి సమయాల్లోనే గొడవలు ముదురుతాయి. తాజాగా తమిళనాడులో కూడా ప్రభుత్వం గవర్నర్లనుంచి ఆ అధికారాన్ని తము హస్తగతం చేసుకోవాలని చూస్తోంది.

న్యాయనిపుణులతో సంప్రదింపులు..
అయితే గవర్నర్ల అధికారాలకు కత్తెర వేయడం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందా..? ఒకవేళ వైస్ ఛాన్స్ లర్లను నియమించాలంటే దానికి తీర్మానం ఎలా చేయాలి అనే విషయంపై డీఎంకే ప్రభుత్వం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ విషయంలో మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ బాటలో పయనించేందుకు సిద్ధమైంది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు యూనివర్శిటీల వైస్ ఛాన్స్ లర్ల నియామకంలో తమ పట్టు నిలుపుకేందుకు అసెంబ్లీలో తీర్మానాలు చేశాయి. గవర్నర్ చేపట్టే నియామక ప్రక్రియను నామమాత్రం చేశాయి. దీంతో తమిళనాడు కూడా అదే బాటలో పయనించాలని చూస్తోంది.

First Published:  7 Jan 2022 1:21 AM GMT
Next Story