Telugu Global
NEWS

నడ్డా ఎంట్రీతో వేడెక్కిన తెలంగాణ రాజకీయం..

తెలంగాణలో బండి సంజయ్ అరెస్ట్.. తదనంతర పరిణామాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవోకి వ్యతిరేకంగా బండి సంజయ్ నిరసన తెలియజేయడం.. కొవిడ్ నిబంధనల పేరుతో ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకి తరలించడంతో ఈ వివాదం రాజుకుంది. కొవిడ్ నిబంధనలు ప్రతిపక్షాలకేనా.. ప్రభుత్వంలో ఉన్నవారికి పట్టవా, అసలు కేసీఆర్ ఎప్పుడైనా మాస్క్ పెట్టుకున్నా.. టీఆర్ఎస్ రాజకీయ మీటింగ్ లలో సామాజిక దూరం కనిపిస్తుందా అంటూ నేరుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. […]

నడ్డా ఎంట్రీతో వేడెక్కిన తెలంగాణ రాజకీయం..
X

తెలంగాణలో బండి సంజయ్ అరెస్ట్.. తదనంతర పరిణామాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన జీవోకి వ్యతిరేకంగా బండి సంజయ్ నిరసన తెలియజేయడం.. కొవిడ్ నిబంధనల పేరుతో ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకి తరలించడంతో ఈ వివాదం రాజుకుంది. కొవిడ్ నిబంధనలు ప్రతిపక్షాలకేనా.. ప్రభుత్వంలో ఉన్నవారికి పట్టవా, అసలు కేసీఆర్ ఎప్పుడైనా మాస్క్ పెట్టుకున్నా.. టీఆర్ఎస్ రాజకీయ మీటింగ్ లలో సామాజిక దూరం కనిపిస్తుందా అంటూ నేరుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన జైలులో ఉన్న బండి సంజయ్ ని కలసి సంఘీభావం ప్రకటించారు. అదే సమయంలో బీజేపీ నిరసనల్లో పాల్గొనడానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రావడంతో వ్యవహారం మరింత ముదిరింది.

వినాశ కాలే విపరీత బుద్ది..
నడ్డా ర్యాలీలో పాల్గొంటారా, ఒకవేళ పాల్గొంటే.. కొవిడ్ నిబంధనలు అతిక్రమించారంటూ పోలీసులు ఆయన్ను కూడా అరెస్ట్ చేస్తారా అనే ఉత్కంఠ కొనసాగింది. అయితే జేపీ నడ్డాని ఓ దశలో పోలీసులసు అడ్డుకోవాలని చూసినా.. ఆయన కొవిడ్ నిబంధనల మేరకే తన పర్యటన ఉంటుందని చెప్పి ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చారు. సికింద్రాబాద్‌ లోని మహాత్మగాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించి నిరసనను అక్కడే ముగించి నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ కి చేరుకున్నారు నడ్డా. తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని, ఎక్కువ అవినీతి ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, అవినీతి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై బీజేపీ తమ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఎంపీ బండి సంజయ్‌ పై పోలీసులు చేయిచేసుకున్నారని, బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారని ఆరోపించారు నడ్డా. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ను కేసీఆర్‌ ఏటీఎంలా వాడుకున్నారని, తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోందని, వినాశకాలే విపరీత బుద్ది అన్నట్లు.. కేసీఆర్‌ పాలన ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని విమర్శించారు నడ్డా.

ఒప్పంద గొడవలు -కాంగ్రెస్..
బండి సంజయ్ అరెస్ట్, నడ్డా నిరసన.. ఇవన్నీ టీఆర్ఎస్ తో బీజేపీ చేసుకున్న ఒప్పంద గొడవలేనంటూ విమర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో బీజేపీని ప్రధాన ప్రతిపక్షంగా చూపించేందుకు టీఆర్ఎస్ ఆడుతున్న నాటకం ఇదని అన్నారు. 2023 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ ను బంగాళాఖాతంలో కలుపుతామని అన్నారు. కొవిడ్ సోకడంతో హోమ్ ఐసోలేషన్లో ఉన్న రేవంత్ రెడ్డి.. ట్విట్టర్లో టీఆర్ఎస్, బీజేపీపై ధ్వజమెత్తారు.

First Published:  4 Jan 2022 9:49 PM GMT
Next Story