Telugu Global
National

యూపీలో శ్రీకృష్ణ రాజకీయం..

యూపీ రాజకీయాల్లో అనూహ్యంగా శ్రీకృష్ణుడిని తెరపైకి తెచ్చాయి ప్రధాన పార్టీలు. శ్రీ కృష్ణుడు తనకు రోజూ కలలోకి వస్తున్నాడని అన్నారు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. అంతే కాదు.. కలలోకి వచ్చి అసెంబ్లీ ఎన్నికల తర్వాత రామరాజ్య స్థాపన జరుగుతుందని దీవించినట్టు కూడా చెప్పారు. రామరాజ్యమంటే సామ్యవాదమని, సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వచ్చినరోజే రామరాజ్య స్థాపన జరుగుతుందని ఆయన వివరించారు. అలా శ్రీకృష్ణుడికి తన కలతోపాటు, పొలిటికల్ సీన్ పై కూడా ఎంట్రీ […]

యూపీలో శ్రీకృష్ణ రాజకీయం..
X

యూపీ రాజకీయాల్లో అనూహ్యంగా శ్రీకృష్ణుడిని తెరపైకి తెచ్చాయి ప్రధాన పార్టీలు. శ్రీ కృష్ణుడు తనకు రోజూ కలలోకి వస్తున్నాడని అన్నారు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్. అంతే కాదు.. కలలోకి వచ్చి అసెంబ్లీ ఎన్నికల తర్వాత రామరాజ్య స్థాపన జరుగుతుందని దీవించినట్టు కూడా చెప్పారు. రామరాజ్యమంటే సామ్యవాదమని, సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వచ్చినరోజే రామరాజ్య స్థాపన జరుగుతుందని ఆయన వివరించారు. అలా శ్రీకృష్ణుడికి తన కలతోపాటు, పొలిటికల్ సీన్ పై కూడా ఎంట్రీ ఇప్పించారు అఖిలేష్.

కలలోకి వచ్చాడు.. కానీ శపించాడు..
శ్రీకృష్ణుడు, అఖిలేష్ కలలోకి వచ్చినమాట వాస్తవమేనని, కానీ ఆయన్ను దీవించలేదని, గోపాలుడు అఖిలేష్ ని శపించాడని విమర్శించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. అధికారంలో ఉన్న స‌మ‌యంలో మ‌ధుర‌, బృందావ‌న్‌, గోకుల్‌ ప్రాంతాలను సమాజ్ వాదీ పార్టీ పాలకులు ప‌ట్టించుకోలేదని, అందుకే వారిని శ్రీకృష్ణుడు నిందిస్తాడ‌ని, శపిస్తాడని అన్నారు యోగి. అఖిలేష్ అధికారంలో ఉండ‌గా ఘ‌ర్ష‌ణ‌ల‌ను ప్రేరేపించేవారని, ఉగ్ర‌వాదుల‌ను జైలునుంచి విడుద‌ల చేశార‌ని యోగి ఆరోపించారు.

రాముడు, కృష్ణుడు.. అందరూ బీజేపీకే సపోర్ట్..
రాముడైనా, కృష్ణుడైనా బీజేపీకే మద్దతిస్తారని అన్నారు యోగి. బీజేపీ ప్రభుత్వంతోనే రామరాజ్య స్థాపన జరుగుతుందని చెప్పారు. అయోధ్యలో తాము రామ మందిరం నిర్మిస్తున్నామ‌ని గుర్తు చేశారు. గ‌త ప్ర‌భుత్వాల హయాంలో ఉగ్ర దాడులు జరిగేవని, క‌ల్లోల ప‌రిస్ధితులు నెల‌కొన్నాయ‌ని చెప్పారు యోగి. గ‌త పాల‌కుల హ‌యాంలో ఉగ్ర‌వాదులు, నేర‌గాళ్లు సీఎం నివాసానికి నేరుగా వెళ్లేవార‌ని, వారిని గౌర‌వించే ప‌రిస్ధితులు ఉండేవ‌ని అన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక నేర‌గాళ్లు కూర‌గాయ‌లు అమ్ముకుంటున్నార‌ని, వారికి పనిలేకుండా పోయిందని చమత్కరించారు. గ‌త ప్ర‌భుత్వాలు ఉగ్ర‌వాదుల‌పై కేసులు ఉప‌సంహ‌రిస్తే త‌మ ప్ర‌భుత్వం వారిపై తూటాల‌ను ఎక్కుపెడుతోంద‌ని అన్నారు యోగి.

మొత్తమ్మీద.. శ్రీకృష్ణుడిని వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చి, దేవుళ్లకి కూడా రాజకీయ రంగు పులుముతున్నారు ఉత్తర ప్రదేశ్ నేతలు. కలలోకి వచ్చి చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు, పెట్టిన శాపాలు.. అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొడుతున్నారు.

First Published:  4 Jan 2022 10:03 PM GMT
Next Story