Telugu Global
NEWS

వారిపై కేసులు పెడితే.. రాష్ట్రంలోని జైళ్లు స‌రిపోవు. " కిష‌న్‌రెడ్డి

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షులు బండి సంజ‌య్ అరెస్టు అప్ర‌జాస్వామిక‌మ‌ని, టీఆర్ఎస్ నేతల‌ కోవిడ్ ఉల్లంఘ‌న‌లు పోలీసుల‌కు క‌నిపించ‌డం లేదా అంటూ బీజేపీ నేత‌, కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. బండి సంజ‌య్ అరెస్టును కిష‌న్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీజేపీ చేస్తున్న దీక్ష‌ల‌కు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం భ‌య‌ప‌డుతోంద‌న్నారు. కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జీవో 317పై నిరసన తెలిపేందుకే బండి సంజయ్ దీక్ష చేశారన్నారు. జీవో 317 తీసుకురావడం కేసీఆర్‌ ప్రభుత్వ తొందరపాటు చర్యేనని, […]

వారిపై కేసులు పెడితే.. రాష్ట్రంలోని జైళ్లు స‌రిపోవు.  కిష‌న్‌రెడ్డి
X

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షులు బండి సంజ‌య్ అరెస్టు అప్ర‌జాస్వామిక‌మ‌ని, టీఆర్ఎస్ నేతల‌ కోవిడ్ ఉల్లంఘ‌న‌లు పోలీసుల‌కు క‌నిపించ‌డం లేదా అంటూ బీజేపీ నేత‌, కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. బండి సంజ‌య్ అరెస్టును కిష‌న్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీజేపీ చేస్తున్న దీక్ష‌ల‌కు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం భ‌య‌ప‌డుతోంద‌న్నారు.

కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జీవో 317పై నిరసన తెలిపేందుకే బండి సంజయ్ దీక్ష చేశారన్నారు. జీవో 317 తీసుకురావడం కేసీఆర్‌ ప్రభుత్వ తొందరపాటు చర్యేనని, కేసీఆర్ మాస్క్ పెట్టుకోవడం తాను ఎప్పుడూ చూడలేదన్నారు కిష‌న్‌రెడ్డి. నల్ల‌గొండ జిల్లా పర్యటనలో మంత్రులు ఎవరూ మాస్కు ధ‌రించ‌లేద‌న్నారు. కరీంనగర్ జిల్లా పార్టీ స‌మావేశంలో ఎవ‌రూ మాస్క్ ధ‌రించ‌లేద‌న్నారు.

క‌రోనా నిబంధ‌న‌లు ప్ర‌జ‌ల‌కు, ప్ర‌తిప‌క్షాల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తాయా..?. టీఆర్ఎస్ పార్టీ నాయ‌కుల‌కు, మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు వ‌ర్తించ‌వా..?. అని కిష‌న్‌రెడ్డి ప్ర‌శ్నించారు. టీఆర్ఎస్‌ నేతల కోవిడ్ నిబంధనల ఉల్లంఘనలు పోలీసులకు కనిపించడం లేదా? అని మండిప‌డ్డారు. టీఆర్‌ఎస్‌కు ఒక చట్టం.. ఇతరులకు మరో చట్టమా అంటూ దుయ్యబట్టారు. టీఆర్ఎస్ నేత‌ల క‌రోనా నిబంధ‌న‌ల‌ ఉల్లంఘనలపై కేసులు పెడితే రాష్ట్రంలోని జైళ్లు సరిపోవని కిషన్ రెడ్డి అన్నారు.

First Published:  4 Jan 2022 12:08 AM GMT
Next Story