Telugu Global
National

నేటినుంచి పిల్లలకు వ్యాక్సిన్లు.. 4 రోజుల టార్గెట్ పెట్టుకున్న గోవా..

భారత్ లో ఈరోజు నుంచి చిన్న పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ల ప్రక్రియ ప్రారంభమవుతోంది. 15 సంవత్సరాలనుంచి 18 ఏళ్ల లోపువారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో ఒక్కో రాష్ట్రం ఒక్కోరకంగా టార్గెట్ పెట్టుకుంది. గోవాలో నాలుగు రోజుల్లో పని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గోవాలో 15 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలు 72వేల మంది ఉన్నట్టు గుర్తించారు. వారందరితో కొవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయించారు. అటు […]

నేటినుంచి పిల్లలకు వ్యాక్సిన్లు.. 4 రోజుల టార్గెట్ పెట్టుకున్న గోవా..
X

భారత్ లో ఈరోజు నుంచి చిన్న పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్ల ప్రక్రియ ప్రారంభమవుతోంది. 15 సంవత్సరాలనుంచి 18 ఏళ్ల లోపువారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో ఒక్కో రాష్ట్రం ఒక్కోరకంగా టార్గెట్ పెట్టుకుంది. గోవాలో నాలుగు రోజుల్లో పని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గోవాలో 15 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలు 72వేల మంది ఉన్నట్టు గుర్తించారు. వారందరితో కొవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ పూర్తి చేయించారు. అటు వ్యాక్సిన్లు కూడా సిద్ధంగా ఉండటంతో.. నాలుగంటే నాలుగు రోజుల్లో గోవాలో ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి చేయాలని చూస్తున్నారు అధికారులు.

టీకాలు రెడీ..
గతేడాది వయోజనులకు టీకా ప్రక్రియ ప్రారంభించేనాటికి, ఇప్పటికి.. వ్యాక్సినేషన్ ప్రక్రియలో చాలా మార్పొలొచ్చాయి. వ్యాక్సినేషన్ మొదలైన తొలినాళ్లలో టీకాల కొరత వేధించేది. ఇప్పుడు దాదాపుగా టీకా లభ్యత ఎక్కువ, టీకా వేయించుకునేవారు తక్కువ అన్నట్టుగా ఉంది పరిస్థితి. చాలా చోట్ల వ్యాక్సిన్లు మురిగిపోయే ప్రమాదం ఉన్నా కూడా.. ప్రజలు టీకా కోసం ముందుకు రావడంలేదు. ఫస్ట్ డోస్ వేయించుకోనివారు కూడా భారత్ లో ఇంకా ఉన్నారు. ఫస్ట్ డోస్ తర్వాత సెకండ్ డోస్ ని మరచిపోయినవారి సంఖ్య మరీ ఎక్కువ. ఈ దశలో ఇప్పుడు 15 నుంచి 18 ఏళ్ల వయసున్నవారికి టీకా ప్రక్రియ మొదలవుతోంది. వీరందరికీ సరిపడా టీకాలు ఇప్పటికే ఆయా రాష్ట్రాల వద్ద ఉన్నాయి. అధికార యంత్రాంగాన్ని రెడీ చేసి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ టార్గెట్ ని పూర్తి చేయబోతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
ఏపీలో 24.41 లక్షలమంది టీనేజర్లకు కొవిడ్ టీకా వేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు. ఇప్పటికే 15 ఏళ్లు పైబడి 18 ఏళ్ల లోపు వారిని గుర్తించారు. వారి ఇంటికి వెళ్లి మరీ ఆరోగ్య కార్యకర్తలు అవగాహన కల్పించారు. విద్యార్థులకు స్కూల్, కాలేజ్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 3 గంటలనుంచి ఇంటికి వెళ్లి టీకాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు వైద్య సిబ్బంది. వారం రోజుల టార్గెట్ పెట్టుకున్నారు.
తెలంగాణలో 22.78 లక్షల మంది పిల్లలకు వ్యాక్సిన్ వేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. తెలంగాణలో కూడా వారం రోజుల్లో టీనేజ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

First Published:  2 Jan 2022 9:21 PM GMT
Next Story