విపక్షాలకు ఏడుపు నామ సంవత్సరం " 2021కి అంబటి చివరి పంచ్..
విపక్షాలపై పంచ్ లు వేస్తూ ముప్ప తిప్పలు పెట్టే వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. 2021లో చివరిగా అందరిపై మరోసారి పంచ్ ల వర్షం కురిపించారు. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2021 వైసీపీకి అభివృద్ధి, సంక్షేమ నామ సంవత్సరమని చెప్పారాయన. అదే సమయంలో బీజేపీకి మాత్రం మద్యపాన సంవత్సరంగా నిలిచిపోయిందని, జనసేనకు 2021 ప్యాకేజీ నామ సంవత్సరం అని సెటైర్లు పేల్చారు. మొత్తంగా విపక్షాలకు 2021 ఏడుపునామ సంవత్సరమని అంబటి వ్యాఖ్యానించారు. తాలిబన్లకు, బీజేపీ నేతలకు […]
విపక్షాలపై పంచ్ లు వేస్తూ ముప్ప తిప్పలు పెట్టే వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. 2021లో చివరిగా అందరిపై మరోసారి పంచ్ ల వర్షం కురిపించారు. ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2021 వైసీపీకి అభివృద్ధి, సంక్షేమ నామ సంవత్సరమని చెప్పారాయన. అదే సమయంలో బీజేపీకి మాత్రం మద్యపాన సంవత్సరంగా నిలిచిపోయిందని, జనసేనకు 2021 ప్యాకేజీ నామ సంవత్సరం అని సెటైర్లు పేల్చారు. మొత్తంగా విపక్షాలకు 2021 ఏడుపునామ సంవత్సరమని అంబటి వ్యాఖ్యానించారు.
తాలిబన్లకు, బీజేపీ నేతలకు తేడా ఉందా..?
బీజేపీ జూదం పార్టీనా అంటూ ధ్వజమెత్తారు అంబటి రాంబాబు. జిన్నా టవర్ ను పేల్చేస్తామని బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఆఫ్ఘనిస్తాన్‌లో బుద్ధుడి విగ్రహాన్ని కూల్చేసిన తాలిబన్లకు, ఇక్కడ జిన్నా టవర్ ని పేల్చేస్తామన్న బీజేపీ నేతలకు తేడా ఏముందని ప్రశ్నించారు. అద్వానీ స్వయంగా పాకిస్తాన్ వెళ్లి జిన్నా సమాధిని సందర్శించారని గుర్తు చేశారు. గుంటూరు జిన్నా టవర్ పేల్చేస్తామంటున్నవారంతా అద్వానీ చర్యను ఖండిస్తారా అని ప్రశ్నించారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీ, జిన్నా.. అందరూ కలసి పనిచేశారని చెప్పారు.
1943లో జిన్నా టవర్ నిర్మించారని, అసలిన్నాళ్లూ బీజేపీ ఏం చేస్తోందని, పేరు మార్చాలని ఇప్పుడు డిమాండ్ చేయడం ఏంటని ప్రశ్నించారు అంబటి. బీజేపీ నేతలు గుడ్డి గుర్రం పల్లు తోముతున్నారా అంటూ విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలన్నారు. చీప్ లిక్కర్‌తో ఓట్లు సంపాదించాలనుకుంటున్న చీప్ పార్టీగా బీజేపీ మారిందన్నారు.
వంగవీటిని హత్యచేసిందెవరో అందరికీ తెలుసు..
హత్యా రాజకీయాలు చేసే ఖర్మ వైసీపీకి పట్టలేదని అన్నారు అంబటి రాంబాబు. వంగవీటి రంగాను ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసని చెప్పారు. మొత్తమ్మీద ఏడాది చివరిరోజు ప్రెస్ మీట్ పెట్టి విపక్షాలన్నిటికీ మరోసారి చాకిరేవు పెట్టారు అంబటి.