Telugu Global
National

రెడ్ జోన్ లోకి ముంబై.. ఆంక్షలు మరింత కఠినం..

దేశవ్యాప్తంగా కరోనా కేసులు, అందులోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దాదాపుగా థర్డ్ వేవ్ మొదలైనట్టేనని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్క రోజు వ్యవధిలోనే ముంబైలో 47శాతం కేసులు పెరిగాయంటే కొవిడ్ వ్యాప్తి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కరోజులో అక్కడ 5428 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దాదాపుగా ముంబై రెడ్ జోన్ లోకి వెళ్లిందనే చెప్పాలి. మహారాష్ట్రలో కొత్తగా నమోదవుతున్న కొవిడ్ […]

రెడ్ జోన్ లోకి ముంబై.. ఆంక్షలు మరింత కఠినం..
X

దేశవ్యాప్తంగా కరోనా కేసులు, అందులోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. దాదాపుగా థర్డ్ వేవ్ మొదలైనట్టేనని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్క రోజు వ్యవధిలోనే ముంబైలో 47శాతం కేసులు పెరిగాయంటే కొవిడ్ వ్యాప్తి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కరోజులో అక్కడ 5428 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దాదాపుగా ముంబై రెడ్ జోన్ లోకి వెళ్లిందనే చెప్పాలి.

మహారాష్ట్రలో కొత్తగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో ఎక్కువగా బయటపడుతుంది ఒమిక్రాన్ వేరియంట్ కేసులే కావడం గమనార్హం. త్వరలోనే ఇది డెల్టాను అధిగమిస్తుందని చెబుతున్నారు నిపుణులు. భవిష్యత్తులో రాబోయేవన్నీ ఒమిక్రాన్ వేరియంట్ కేసులేననే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ప్రస్తుతానికి ఒమిక్రాన్ తో వచ్చిన ముప్పేమీ లేదని చెబుతున్నా, దేశంలో ఒమిక్రాన్ కారణంగా మరణాలు కూడా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. రాజస్థాన్ ఉదయ్‌ పూర్‌ కు చెందిన 73 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. అటు పుణెలోని పింప్రీ చించువాడ మున్సిపల్ కార్పొరేషన్‌ కు చెందిన 52 ఏళ్ల వ్యక్తి కూడా ఒమిక్రాన్‌తో చనిపోయినట్టు అధికారులు నిర్ధారించారు.

ఆంక్షల వలయంలో ముంబై..
ఒమిక్రాన్ కేసులతో ఢిల్లీ కాస్త ముందుగా అలర్ట్ అయింది. ఇప్పుడు ముంబై కూడా పూర్తి స్థాయిలో ఆంక్షల వలయంలోకి వెళ్లిపోతోంది. ముంబైలో బ‌హిరంగ ప్ర‌దేశాల్లో మాస్క్ త‌ప్ప‌నిస‌రి చేశారు, మాస్క్ లేనివారికి వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తున్నారు. ముంబైలో కొత్త సంవత్సర వేడుకలపై కూడా నిషేధం విధించారు. నైట్ కర్ఫ్యూ కూడా అమలులో ఉంది. రాత్రి 11 గంటలనుంచి తెల్లవారు ఝామున 5 వరకు ఎవరూ రోడ్లపై తిరగడానికి వీళ్లేదు. మరోవైపు బీచ్ లలో జన సంచారాన్ని నిషేధించారు. జనవరి-15 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు అధికారులు. నిబంధ‌న‌లు అతిక్ర‌మిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం, పోలీసులు స్ప‌ష్టం చేశారు.

First Published:  31 Dec 2021 9:12 PM GMT
Next Story