Telugu Global
Cinema & Entertainment

లైగర్ రికార్డుల మోత

విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న కొత్త సినిమా లైగర్. పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ ఎవెయిటింగ్ మూవీగా ప్రేక్షకులు లైగర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ క్రేజ్ వల్లే లైగర్ నుంచి విడుదలయ్యే ప్రతి అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా శుక్రవారం లైగర్ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. లైగర్ గ్లింప్స్ 24 గంటల్లో 16 మిలియన్ వ్యూస్ సాధించి […]

లైగర్ రికార్డుల మోత
X

విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న కొత్త సినిమా లైగర్. పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ ఎవెయిటింగ్ మూవీగా ప్రేక్షకులు లైగర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ క్రేజ్ వల్లే లైగర్ నుంచి విడుదలయ్యే ప్రతి అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

న్యూ ఇయర్ సందర్భంగా శుక్రవారం లైగర్ నుంచి విడుదల చేసిన గ్లింప్స్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. లైగర్ గ్లింప్స్ 24 గంటల్లో 16 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. మరే చిత్రానికి యూట్యూబ్ లో 24 గంటల వ్యవధిలో 16 మిలియన్ వ్యూస్ రాలేదంటే లైగర్ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. విడుదలైన 7 గంటల్లోనే పాత రికార్డులు బద్దలు కొట్టిన లైగర్ గ్లింప్స్..24 గంటల్లో ఎవర్ గ్రీన్ వ్యూయింగ్ రికార్డ్ క్రియేట్ చేసింది.

మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్ లో లైగర్ గా బీస్ట్ లుక్ లో ఆకట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. తన సినిమాల్లో హీరోలను మోస్ట్ ఎగ్రెసివ్ గా చూపించే డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రౌడీ స్టార్ ను అదే రేంజ్ లో మాసీగా మార్చేశాడు. లైగర్ ఫస్ట్ గ్లింప్స్ యాష్ ట్యాగ్ ప్యాన్ ఇండియా లెవెల్లో ట్విట్టర్ లో ట్రెండ్ అయ్యింది.

ముంబై వీధుల్లో ఛాయ్ వాలాగా జీవించే ఓ యువకుడు బాక్సింగ్ ఛాంపియన్ గా ఎలా ఎదిగాడన్నది సినిమాలో ఆసక్తికరంగా చూపించబోతున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ బ్యానర్లపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా కలిసి నిర్మిస్తున్నారు.

First Published:  1 Jan 2022 8:14 AM GMT
Next Story