Telugu Global
NEWS

అలాంటి వారే పేదలకు శత్రువులు.. అత్యథిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే..

అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అడ్డుపడుతున్నవారంతా పేదలకు శత్రువులని విమర్శించారు సీఎం జగన్. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పింఛన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోనే అత్యథికంగా సామాజిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీ అని చెప్పారు జగన్. గత ప్రభుత్వం కేవలం 36 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చిందని, తమ హయాంలో 62 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేశామని తెలిపారు. గత ప్రభుత్వం పింఛన్లకోసం 400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే […]

అలాంటి వారే పేదలకు శత్రువులు.. అత్యథిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే..
X

అభివృద్ధి, సంక్షేమ పథకాలకు అడ్డుపడుతున్నవారంతా పేదలకు శత్రువులని విమర్శించారు సీఎం జగన్. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పింఛన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోనే అత్యథికంగా సామాజిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీ అని చెప్పారు జగన్. గత ప్రభుత్వం కేవలం 36 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చిందని, తమ హయాంలో 62 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేశామని తెలిపారు. గత ప్రభుత్వం పింఛన్లకోసం 400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తాము వచ్చాక 1450 కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఇప్పుడు మొత్తం 1570 కోట్ల రూపాయలు సామాజిక పింఛన్లకోసం కేటాయిస్తున్నామని చెప్పారు. కొత్త ఏడాది కొత్త నెలలో 1.51 లక్షల మందికి అదనంగా పింఛన్లు ఇస్తున్నట్టు తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని అన్నారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం పింఛన్ పెంపుపైనే చేసినట్టు గుర్తు చేసుకున్నారు.

కోర్టు కేసులతో అభివృద్ధి అడ్డుకుంటారా..?
ఎవరైనా మంచి పాలన కోసం ఆరాటపడతారని, కానీ.. ప్రతిపక్షాలు అభివృద్ధికి, సంక్షేమానికి అడ్డుపడుతున్నాయని విమర్శించారు సీఎం జగన్. మంచి పనులకు కూడా అడ్డు తగులుతున్నారని మండిపడ్డారు. కోర్టులకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని చెప్పారు. విమర్శించే వాళ్లకు తాము చేసే అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

వారే పేదలకు శత్రువులు..
అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడేవారే పేదలకు శత్రువులని అన్నారు జగన్. సినిమా టికెట్ల అంశంపై కూడా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఓటీఎస్‌ పథకంపై కూడా దుష్ఫ్రచారంచేశారని, అలాంటి వాళ్లంతా పేదలకు శత్రువులేనని అన్నారు జగన్. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఏపీలో అభివృద్ధి ఆగదని హామీ ఇచ్చారాయన.

First Published:  1 Jan 2022 5:05 AM GMT
Next Story