Telugu Global
Cinema & Entertainment

భోళాశంకర్ అదరగొట్టాడు

చిరంజీవి హీరోగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ “భోళా శంకర్”. ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా ఇవాళ ఈ సినిమాలోని ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మూవీలో చిరంజీవి స్టయిల్ ఎలా ఉంటుందో చూపించారు. స్వాగ్ ఆఫ్ భోళాలో కంప్లీట్ మాస్ లుక్ లో ఉన్న మెగాస్టార్ స్టైలిష్ మేకోవర్ అదిరిపోయింది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కు స్వాగ్ ఆఫ్ భోళా న్యూ ఇయర్ గిఫ్ట్ గా […]

భోళాశంకర్ అదరగొట్టాడు
X

చిరంజీవి హీరోగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ “భోళా శంకర్”. ఈ చిత్రాన్ని మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా ఇవాళ ఈ సినిమాలోని ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మూవీలో చిరంజీవి స్టయిల్ ఎలా ఉంటుందో చూపించారు.

స్వాగ్ ఆఫ్ భోళాలో కంప్లీట్ మాస్ లుక్ లో ఉన్న మెగాస్టార్ స్టైలిష్ మేకోవర్ అదిరిపోయింది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కు స్వాగ్ ఆఫ్ భోళా న్యూ ఇయర్ గిఫ్ట్ గా భావించవచ్చు. స్వాగ్ ఆఫ్ భోళాతో పాటు సినిమా థీమ్ మ్యూజిక్ తో విడుదల చేసిన మోషన్ వీడియో కూడా ఆకట్టుకుంటోంది.

మెగాస్టార్ సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ తమన్నా నటిస్తున్న భోళా శంకర్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో కీలక షెడ్యూల్ ను ఇటీవలే కంప్లీట్ చేశారు. కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా కనిపించనుంది.

యంగ్ సెన్సేషన్ మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. డూడ్లీ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమా థియేటర్లలోకి రాబోతోంది.

First Published:  1 Jan 2022 8:16 AM GMT
Next Story