Telugu Global
NEWS

ఏపీలో మూసేసిన సినిమా థియేటర్ల ఓపెన్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల సినిమా టికెట్ల ధరలు తగ్గించిన విషయం తెలిసిందే. అలాగే సినిమా టికెట్లు విక్రయించేందుకు గాను ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు కూడా ప్రకటించింది. కాగా ఇటీవల అఖండ, పుష్ప సినిమాలు విడుదలైన సమయంలో రాష్ట్రంలోని కొన్ని థియేటర్లలో నిబంధనలు ఉల్లంఘించి టికెట్ రేట్లను పెంచి విక్రయించారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా బెనిఫిట్ షోలు కూడా వేశారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించిన పలు థియేటర్లను ప్రభుత్వం సీజ్ చేసింది. కాగా దీనిపై […]

ఏపీలో మూసేసిన సినిమా థియేటర్ల ఓపెన్..!
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల సినిమా టికెట్ల ధరలు తగ్గించిన విషయం తెలిసిందే. అలాగే సినిమా టికెట్లు విక్రయించేందుకు గాను ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు కూడా ప్రకటించింది. కాగా ఇటీవల అఖండ, పుష్ప సినిమాలు విడుదలైన సమయంలో రాష్ట్రంలోని కొన్ని థియేటర్లలో నిబంధనలు ఉల్లంఘించి టికెట్ రేట్లను పెంచి విక్రయించారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా బెనిఫిట్ షోలు కూడా వేశారు.

ఇలా నిబంధనలు ఉల్లంఘించిన పలు థియేటర్లను ప్రభుత్వం సీజ్ చేసింది. కాగా దీనిపై కొద్ది రోజులుగా దుమారం రేగుతోంది. సినిమా టిక్కెట్ల ధర తగ్గింపుపై పలువురు సినీ ప్రముఖులు నేరుగా ప్రభుత్వం పై అసహనం వ్యక్తం చేశారు. సీనియర్ నటుడు ఆర్.నారాయణమూర్తి కూడా ఇటీవల ఏపీలో మూసివేసిన థియేటర్లను తెరిపించాలని ప్రభుత్వానికి విన్నవించారు.

కాగా ఇవాళ నారాయణమూర్తి తోపాటు పలువురు థియేటర్ల యజమానులు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని కలిశారు. మూసివేసిన థియేటర్లను తెరిపించాలని వారు మంత్రిని కోరారు. అలాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో మూసివేసిన 83 థియేటర్లు తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అధికారులు గుర్తించిన లోపాలను థియేటర్ల యజమానులు సరిదిద్దుకోవడం తోపాటు, నెల రోజుల్లో థియేటర్లలో అన్ని వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

మూసివేతకు గురైన థియేటర్లలో అన్ని వసతులు కల్పించిన తర్వాత నెల రోజుల్లో ఆయా జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ లకు థియేటర్లు తెరుచుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పేర్ని నాని సూచించారు. కాగా ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో మూసివేతకు గురైన 83 థియేటర్లు తిరిగి తెరుచుకోనున్నాయి.

First Published:  30 Dec 2021 2:15 AM GMT
Next Story