Telugu Global
Cinema & Entertainment

ఆర్ఆర్ఆర్.. బేరసారాలు మొదలు

మరో వారం రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో బేరసారాలు మొదలయ్యాయి. ఏపీలో సీజ్ చేసిన థియేటర్లు రేపట్నుంచి తెరుస్తున్నారు. కానీ టికెట్ రేట్లు మాత్రం పెరగలేదు. ఓవైపు పాత రేట్లకే టిక్కెట్లు అమ్ముతున్నప్పటికీ ప్రభుత్వం చూసీచూడనట్టు వదిలేస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ రేటును 30శాతం మేర తగ్గించుకుంటానని ముందుకొచ్చారు నిర్మాత దానయ్య. కానీ బయ్యర్లు మాత్రం 50శాతం డిస్కౌంట్ అడుగుతున్నారు. ఆంధ్రా-సీడెడ్ కలిపి 140 కోట్ల రూపాయలకు అమ్మారు. ఇప్పుడు […]

ఆర్ఆర్ఆర్.. బేరసారాలు మొదలు
X

మరో వారం రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో బేరసారాలు మొదలయ్యాయి. ఏపీలో సీజ్ చేసిన థియేటర్లు రేపట్నుంచి తెరుస్తున్నారు. కానీ టికెట్ రేట్లు మాత్రం పెరగలేదు. ఓవైపు పాత రేట్లకే టిక్కెట్లు అమ్ముతున్నప్పటికీ ప్రభుత్వం చూసీచూడనట్టు వదిలేస్తుంది.

ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ రేటును 30శాతం మేర తగ్గించుకుంటానని ముందుకొచ్చారు నిర్మాత దానయ్య. కానీ బయ్యర్లు మాత్రం 50శాతం డిస్కౌంట్ అడుగుతున్నారు. ఆంధ్రా-సీడెడ్ కలిపి 140 కోట్ల రూపాయలకు అమ్మారు. ఇప్పుడు ఇందులోంచి దాదాపు 40 కోట్లు నష్టం భరించడానికి దానయ్య రెడీ అయ్యారు. కానీ బయ్యర్లు మాత్రం 70 కోట్లు తగ్గించుకోమని డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణలో ఈ సినిమాకు సమస్య లేదు. ఆల్రెడీ టికెట్ రేట్లను అక్కడ అధికారికంగా పెంచేశారు. సమస్య మొత్తం ఆంధ్రాతోనే వస్తోంది. రేపు లేదా ఎల్లుండిలోగా ఈ ఇష్యూను ఓ కొలిక్కి తీసుకురావాలని దానయ్య భావిస్తున్నారు. ఇవాళ్టికి మీటింగ్ వాయిదా పడింది. నెక్ట్స్ మీటింగ్ కు రాజమౌళిని తీసుకొచ్చే ఆలోచనలో దానయ్య ఉన్నట్టు తెలుస్తోంది.

First Published:  30 Dec 2021 10:19 AM GMT
Next Story