Telugu Global
NEWS

`వాట్ ఏ స్కీమ్.. వాట్ ఏ షేమ్‌`.. సోము వీర్రాజుకు కేటీఆర్ కౌంట‌ర్‌

లిక్క‌ర్‌పై భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్య‌లపై పెద్ద దుమారం రేగుతోంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఛీప్‌ లిక్కర్ రూ.50కే ఇస్తామంటూ వీర్రాజు మాట్లాడిన వీడియోలు విప‌రీతంగా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇప్పుడు సోము వీర్రాజు మాట్లాడిన మాట‌లే ఏపీలో హాట్ టాపిక్‌. ఏపీ బీజేపీ అధ్య‌క్షుడి మాట‌ల‌పై సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ట్రోలింగ్ జ‌రుగుతోంది. 2024లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ గెలిపించాల‌ని కోరుతూ తాము అధికారంలోకి వస్తే ముందుగా  […]

`వాట్ ఏ స్కీమ్.. వాట్ ఏ షేమ్‌`.. సోము వీర్రాజుకు కేటీఆర్ కౌంట‌ర్‌
X

లిక్క‌ర్‌పై భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్య‌లపై పెద్ద దుమారం రేగుతోంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఛీప్‌ లిక్కర్ రూ.50కే ఇస్తామంటూ వీర్రాజు మాట్లాడిన వీడియోలు విప‌రీతంగా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఇప్పుడు సోము వీర్రాజు మాట్లాడిన మాట‌లే ఏపీలో హాట్ టాపిక్‌. ఏపీ బీజేపీ అధ్య‌క్షుడి మాట‌ల‌పై సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ట్రోలింగ్ జ‌రుగుతోంది.

2024లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ గెలిపించాల‌ని కోరుతూ తాము అధికారంలోకి వస్తే ముందుగా క్వార్టర్ సీసాను రూ.75కే ఇస్తాం. ఇంకా కుదిరితే రూ.50కే ఇస్తామ‌ని ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు మాట్లాడారు. వీర్రాజు కామెంట్స్‌పై ప్రశ్నల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలో లిక్కర్ ఫర్ ఓటు అంటూ క్యాంపెయిన్ నడుస్తోంది.

సోము వీర్రాజు వ్యాఖ్య‌ల‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. “వాట్ ఏ స్కీమ్.. వాట్ ఏ షేమ్‌..“ అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా కేటీఆర్ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. రూ.50కే ఛీప్ లిక్కర్ అనే బంపర్ ఆఫర్ బీజేపీ జాతీయ విధానమా? లేక కేవలం బీజేపీ బలహీనంగా ఉన్న రాష్ట్రాలకి మాత్రమేనా’ అని తెలంగాణ మంత్రి కేటీఆర్‌.. ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిని ప్ర‌శ్నించారు.

First Published:  29 Dec 2021 5:04 AM GMT
Next Story