Telugu Global
National

ఢిల్లీలో ఎల్లో అలర్ట్.. స్కూళ్లు, సినిమా థియేటర్లు మూత..

జూన్-9 తర్వాత ఢిల్లీలో మళ్లీ కరోనా కేసులు ఆ స్థాయిలో మళ్లీ పెరిగాయి. గడచిన 24గంటల వ్యవధిలో 331 కేసులు నమోదు కావడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్ వేరియంట్ తోపాటు.. సాధారణ కొవిడ్ కేసులు కూడా పెరగడంతో ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం, తాజాగా ఎల్లో అలర్ట్ ప్రకటించి స్కూళ్లు, సినిమా థియేటర్లకు కూడా మూతవేస్తోంది. కొత్తగా అమలులోకి వచ్చే ఆంక్షలివే.. – స్కూళ్లు, […]

ఢిల్లీలో ఎల్లో అలర్ట్.. స్కూళ్లు, సినిమా థియేటర్లు మూత..
X

జూన్-9 తర్వాత ఢిల్లీలో మళ్లీ కరోనా కేసులు ఆ స్థాయిలో మళ్లీ పెరిగాయి. గడచిన 24గంటల వ్యవధిలో 331 కేసులు నమోదు కావడంతో కేజ్రీవాల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒమిక్రాన్ వేరియంట్ తోపాటు.. సాధారణ కొవిడ్ కేసులు కూడా పెరగడంతో ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం, తాజాగా ఎల్లో అలర్ట్ ప్రకటించి స్కూళ్లు, సినిమా థియేటర్లకు కూడా మూతవేస్తోంది.

కొత్తగా అమలులోకి వచ్చే ఆంక్షలివే..
– స్కూళ్లు, విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు తెరవడానికి వీళ్లేదు.
– సినిమా హాళ్లు, మల్టీ ప్లెక్స్‌లు, ఆడిటోరియాలను పూర్తిగా మూసివేస్తారు.
– జిమ్ లు, స్పా సెంటర్లు, యోగా కేంద్రాలు తెరిచేందుకు వీలు లేదు.
– రాజకీయ, మతపరమైన కార్యక్రమాలు, సభలు, సమావేశాలు నిర్వహించేందుకు వీలు లేదు. గతంలో ఆంక్షలు ఉండగా, ఇప్పుడు ఏకంగా నిషేధం తెరపైకి వచ్చింది.
– హోటళ్లు తెరుచుకోవచ్చు, రెస్టారెంట్లను 50శాతం సామర్థ్యంతో నిర్వహించుకునే వీలుంది. బార్లకు కూడా ఇవే ఆంక్షలు ఉంటాయి. అయితే బార్లను మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10గంటల వరకు మాత్రమే తెరవాల్సి ఉంటుంది.
– మెట్రో రైళ్లలో తిరిగి పాత ఆంక్షలు పెట్టారు, 50శాతం మాత్రమే సీటింగ్ కెపాసిటీ. అంతకు మించి ఎవరూ ఎక్కకూడదు. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే బస్సులకు కూడా ఇవే ఆంక్షలు పెట్టారు. ఆటోలు, ట్యాక్సీలు, ఈ-రిక్షాల్లో ఇద్దరు ప్రయాణికులకు గరిష్ట పరిమితి ఉంది.
– స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేస్తారు. ప్రైవేట్ ఆఫీస్ లలో 50శాతం మంది ఉద్యోగులకే అనుమతి, అది కూడా.. ఉదయం 9కి ఆఫీస్ తెరిస్తే సాయంత్రం 5 గంటలకు మూసివేయాల్సిందే. 24గంటల షిఫ్ట్ లు ఇకపై కుదరవు. అన్నిటికంటే ముఖ్యంగా రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కఠిన ఆంక్షలు ఉంటాయి.
ఇటీవల ఒమిక్రాన్ ప్రభావంతో దేశంలో అన్ని రాష్ట్రాలు ఆంక్షలు పెంచుకుంటూ పోతున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఎల్లో అలర్ట్ తో కొన్ని కార్యకలాపాలపై నిషేధాజ్ఞలు విధించింది.

First Published:  28 Dec 2021 10:07 AM GMT
Next Story