Telugu Global
Health & Life Style

ఆరోగ్య సూచీలో కేరళ ఫస్ట్.. యూపీ లాస్ట్..

భారత ఆరోగ్య సూచీలో కేరళ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. వరుసగా నాలుగో సారి తన ఫస్ట్ ర్యాంక్ ని పదిలపరచుకుంది. ఈ లిస్ట్ లో దేశంలోనే చివరి స్థానంలో నిలిచింది ఉత్తర ప్రదేశ్. అభివృద్ధిలో మేటి, ఎవరూ లేరు సాటి అంటూ.. యూపీ గురించి ప్రధాని మోదీ, సీఎం యోగి చేసుకునే ప్రచారం విలువ ఏ పాటిదో ఈ ఆరోగ్య సూచీతో స్పష్టమైంది. కేరళ తర్వాత తమిళనాడు, తెలంగాణ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. […]

ఆరోగ్య సూచీలో కేరళ ఫస్ట్.. యూపీ లాస్ట్..
X

భారత ఆరోగ్య సూచీలో కేరళ మరోసారి మొదటి స్థానంలో నిలిచింది. వరుసగా నాలుగో సారి తన ఫస్ట్ ర్యాంక్ ని పదిలపరచుకుంది. ఈ లిస్ట్ లో దేశంలోనే చివరి స్థానంలో నిలిచింది ఉత్తర ప్రదేశ్. అభివృద్ధిలో మేటి, ఎవరూ లేరు సాటి అంటూ.. యూపీ గురించి ప్రధాని మోదీ, సీఎం యోగి చేసుకునే ప్రచారం విలువ ఏ పాటిదో ఈ ఆరోగ్య సూచీతో స్పష్టమైంది. కేరళ తర్వాత తమిళనాడు, తెలంగాణ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 100 మార్కులకు గాను కేరళకు 82.2 మార్కులు రాగా, తమిళనాడుకి 72.42 మార్కులు, తెలంగాణకు 69.96 మార్కులొచ్చాయి. నాలుగో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కి 69.95 మార్కులు వచ్చాయి. ఏపీ, తెలంగాణకు ఉన్న తేడా చాలా స్వల్పం. ఈ లిస్ట్ లో ఉత్తర ప్రదేశ్ కి కనిష్టంగా 30.57 మార్కులు రావడం విశేషం. బీహార్ కూడా ఈ విషయంలో యూపీ కంటే మెరుగైన ఫలితాలు సాధించింది.

పురిటి బిడ్డల మరణాలు, ఐదు నెలల లోపు చిన్నారుల మరణాలు, ఆడ, మగ లింగ నిష్పత్తి, ప్రభుత్వ ఆస్పత్రుల్లో జరిగే ప్రసవాలు, ఆరోగ్య శాఖకు సంబంధించి కీలక స్థానాల్లో అధికారులు ఉన్నారా లేరా అనేది కూడా లెక్కగట్టి ఈ లిస్ట్ తయారు చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ, నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో సర్వే చేపట్టి రాష్ట్రాలకు ర్యాంకులిచ్చారు.

ప్రజారోగ్య వివరాల నమోదులో కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర ముందున్నాయని నీతి ఆయోగ్ కితాబిచ్చింది. దేశవ్యాప్తంగా గతంతో పోల్చి చూస్తే 47శాతం రాష్ట్రాలు ప్రజారోగ్య సూచికలో మెరుగైన ఫలితాలు సాధించాయని తేలింది. అయితే అదే సమయంలో బీహార్, యూపీ లాంటి రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగైనా కూడా చివరి స్థానాల్లోనే ఉండాల్సిన పరిస్థితి. తెలంగాణ, గుజరాత్, పంజాబ్, అసోం రాష్ట్రాలు గతంలో కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.

First Published:  28 Dec 2021 3:50 AM GMT
Next Story