Telugu Global
Cinema & Entertainment

నవీన్ పొలిశెట్టి నుంచి మరో ఫస్ట్ లుక్

నవీన్ పొలిశెట్టి హీరోగా 2 సినిమాలు పైప్ లైన్లో ఉన్నాయి. ఒకటి యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అనుష్క హీరోయిన్ గా రాబోయే చిత్రం. దీనికి సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇప్పుడు నవీన్ నుంచి ఇంకో సినిమా డీటెయిల్స్ వచ్చాయి. ఆ సినిమా ఫస్ట్ లుక్ కూడా వచ్చింది. నవీన్ పోలిశెట్టి హీరోగా ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సంస్థలు సంయుక్తంగా ఓ సినిమా నిర్మించబోతున్నాయి. నవీన్ పోలిశెట్టి పుట్టిన […]

నవీన్ పొలిశెట్టి నుంచి మరో ఫస్ట్ లుక్
X

నవీన్ పొలిశెట్టి హీరోగా 2 సినిమాలు పైప్ లైన్లో ఉన్నాయి. ఒకటి యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై అనుష్క హీరోయిన్ గా రాబోయే చిత్రం. దీనికి సంబంధించి తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇప్పుడు నవీన్ నుంచి ఇంకో సినిమా డీటెయిల్స్ వచ్చాయి. ఆ సినిమా ఫస్ట్ లుక్ కూడా వచ్చింది.

నవీన్ పోలిశెట్టి హీరోగా ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సంస్థలు సంయుక్తంగా ఓ సినిమా నిర్మించబోతున్నాయి. నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ లుక్ లో అచ్చ తెలుగు ఆంధ్రా కుర్రాడిలా కనిపిస్తున్నాడు నవీల్ పొలిశెట్టి.

కళ్యాణ్ శంకర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. జాతిరత్నాలు టైపులో ఈ సినిమా కూడా పూర్తిస్థాయిలో నవ్వులు పంచుతుందని అంటున్నాడు దర్శకుడు. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, హీరోయిన్ వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తారు. స్టార్ డైరక్టర్ త్రివిక్రమ్ భార్య, సాయిసౌజన్య ఈ సినిమాతో నిర్మాతగా పరిచయమౌతున్నారు.

First Published:  27 Dec 2021 6:17 AM GMT
Next Story