Telugu Global
Business

ఆన్‌లైన్ పేమెంట్స్‌లో కొత్త విధానం 'టోకనైజేషన్'.. ఇదెలా పనిచేస్తుందంటే..

ఇకపై ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్ల తీరు మారబోతోంది. ఇక నుంచి కార్డులు లేకుండానే ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. 2022 జనవరి నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులు లేకుండా ఆన్‌లైన్ షాపింగ్ చేసేందుకు కొత్త చెల్లింపుల విధానాన్ని ఆర్బీఐ ప్రవేశపెట్టింది. ఇదెలా పనిచేస్తుందంటే.. సైబర్ క్రైమ్స్‌ను అరికట్టేందుకుగానూ పేమెంట్స్ విషయంలో ఆర్బీఐ కొన్ని కీలక మార్పులు చేసింది. యూజర్ల కార్డు వివరాలు భద్రంగా ఉంచేందుకు 'టోకనైజేషన్' అనే కొత్త పద్దతిని ప్రవేశపెట్టింది. జనవరి 1 నుంచి ఈ మార్పులు అమలవుతాయని […]

ఆన్‌లైన్ పేమెంట్స్‌లో కొత్త విధానం టోకనైజేషన్.. ఇదెలా పనిచేస్తుందంటే..
X

ఇకపై ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్ల తీరు మారబోతోంది. ఇక నుంచి కార్డులు లేకుండానే ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసుకోవచ్చు. 2022 జనవరి నుంచి డెబిట్, క్రెడిట్ కార్డులు లేకుండా ఆన్‌లైన్ షాపింగ్ చేసేందుకు కొత్త చెల్లింపుల విధానాన్ని ఆర్బీఐ ప్రవేశపెట్టింది. ఇదెలా పనిచేస్తుందంటే..

సైబర్ క్రైమ్స్‌ను అరికట్టేందుకుగానూ పేమెంట్స్ విషయంలో ఆర్బీఐ కొన్ని కీలక మార్పులు చేసింది. యూజర్ల కార్డు వివరాలు భద్రంగా ఉంచేందుకు 'టోకనైజేషన్' అనే కొత్త పద్దతిని ప్రవేశపెట్టింది. జనవరి 1 నుంచి ఈ మార్పులు అమలవుతాయని తెలిపింది. ఇకపై ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌లలో కార్డ్‌ నెంబర్, వ్యక్తిగత వివరాలు, సీవీవీ నెంబర్‌ లాంటివి ఎంటర్‌ చేసే పనిలేదు.

టోకనైజేషన్‌ అంటే..
ట్రాన్సాక్షన్‌ జరిపే సమయంలో కార్డ్‌ వివరాలు సైబర్‌ నేరస్తుల చేతుల్లోకి వెళ్లకుండా సెక్యూర్‌గా ఉంచే వ్యవస్థనే టోకెన్‌ అంటారు. టోకనైజేషన్‌ ద్వారా ట్రాన్సాక్షన్‌ చేసిన ప్రతిసారి వ్యక్తిగత, కార్డ్‌ వివరాలు, సీవీవీ నెంబర్‌లను ఎంట్రీ చేయాల్సిన పని ఉండదు. వ్యక్తిగత సమాచారంతో సంబంధం లేకుండా.. కొనుగోళ్లు సజావుగా సాగే విధానమే ఈ టోకనైజేషన్.

ఇలా పనిచేస్తుంది..
షాపింగ్ చేసేటప్పుడు లేదా ఆన్‌లైన్ పేమెంట్స్ చేసేటప్పుడు చెకవుట్ చేసే సమయంలో కార్డు వివరాలను నమోదు చేయాలి. తర్వాత టోకనైజేషన్ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. తమకు నచ్చినన్ని కార్డులను టోకనైజ్ చేసుకోవచ్చు. కానీ విదేశీ కార్డులకు ఇది వర్తించదు.

టోకెనైజ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్న తర్వాత.. కస్టమర్ల కార్డు వివరాలను వారి బ్యాంక్ వివరాలతో మ్యాచ్ అయితే.. వెంటనే టోకెన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఇవి కస్టమర్ డివైజ్‌తో లింక్ అవుతాయి.
తర్వాత ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ జరపాలంటే కార్డు నెంబర్, సీవీవీ నెంబర్లు ఎంటర్ చేయాల్సిన పని లేదు. టోకెన్ నెంబర్ వివరాలు ఇస్తే సరిపోతుంది
దీని ద్వారా సైబర్ మోసాలకు తావుండదని ఆర్బీఐ చెప్తోంది. యూజర్ల సమాచారాన్ని సేకరించడం హ్యాకర్లకు వీలు కాదని అంటోంది.

First Published:  23 Dec 2021 3:56 AM GMT
Next Story