Telugu Global
National

యువతుల చదువు కోసమే వివాహ వయస్సు పెంపు..!

యువతుల చదువు కోసమే వివాహ వయస్సు పెంచినట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో ఇప్పటిదాకా యువతుల వివాహ వయసు 18 సంవత్సరాలు ఉండగా, దానిని ఇటీవల 21 సంవత్సరాలకు పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశంలోని పలు వర్గాలు, పార్టీల నుంచి విమర్శలు చెలరేగాయి. నిన్న తమిళనాడులో యువతుల వివాహ వయస్సు పెంపును నిరసిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు 70 మంది రైతులను అరెస్టు చేశారు. […]

యువతుల చదువు కోసమే వివాహ వయస్సు పెంపు..!
X

యువతుల చదువు కోసమే వివాహ వయస్సు పెంచినట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశంలో ఇప్పటిదాకా యువతుల వివాహ వయసు 18 సంవత్సరాలు ఉండగా, దానిని ఇటీవల 21 సంవత్సరాలకు పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశంలోని పలు వర్గాలు, పార్టీల నుంచి విమర్శలు చెలరేగాయి. నిన్న తమిళనాడులో యువతుల వివాహ వయస్సు పెంపును నిరసిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు 70 మంది రైతులను అరెస్టు చేశారు. ఇక ఎంఐఎం పార్టీ అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై తీవ్ర విమర్శలు చేసింది.

ఈ వ్యవహారం పై విమర్శలు చెలరేగుతుండగానే ఇవాళ లోక్ సభలో బాల్య వివాహాల నియంత్రణ సవరణ బిల్లు- 2021ని ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ లో పర్యటించిన ప్రధాని మోదీ మాట్లాడుతూ యువకులతో సమానంగా యువతుల వివాహ వయస్సును పెంచడాన్ని ఆయన సమర్థించుకున్నారు.

యువతులు తమ చదువు కోసం మరింత సమయం కావాలని కోరుకుంటున్న నేపథ్యంలోనే వారి వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచినట్లు వివరించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఎవరు ఇబ్బంది పడుతున్నారో అందరూ చూస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్ణయం కొందరికి బాధ కలిగిస్తోందని వ్యాఖ్యానించారు.

పార్టీల పేరు వెల్లడించని మోదీ ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు చేస్తున్న పార్టీలకు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురించి మోదీ మాట్లాడుతూ ఆయన హయాంలో యూపీలో శాంతిభద్రతలు మెరుగయ్యాయని అన్నారు. ఐదేళ్ల క్రితం ఉత్తర ప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేదని, ఏదైనా అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ లోకి వెళ్తే.. రేపిస్టులు, నేరస్థులకు అనుకూలంగా ఫోన్లు వచ్చేవన్నారు. ఇప్పుడు అలాంటి నేరస్తుల ఆటలు సాగడం లేదని మోదీ అన్నారు.

First Published:  21 Dec 2021 9:04 AM GMT
Next Story