Telugu Global
National

కర్నాటకలో కోడిగుడ్ల రాజకీయం..

కర్నాటక ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా స్కూల్ విద్యార్థులకు ఉడికించిన కోడి గుడ్లను ఇవ్వడం రాజకీయ దుమారానికి కారణం అయింది. ఉడికించిన కోడి గుడ్లను వెంటనే ఆపేయాలంటూ కొన్ని వర్గాలనుంచి డిమాండ్లు మొదలయ్యాయి. గుడ్లు తినడం తమ ఆచార సంప్రదాయాలకు వ్యతిరేకం అని వారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని, కోడిగుడ్ల బదులుగా ఇతర బలవర్ధక ఆహారాన్ని అందిస్తామంటూ విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ ప్రకటించారు. దీంతో ఈ వివాదం కొత్త […]

కర్నాటకలో కోడిగుడ్ల రాజకీయం..
X

కర్నాటక ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా స్కూల్ విద్యార్థులకు ఉడికించిన కోడి గుడ్లను ఇవ్వడం రాజకీయ దుమారానికి కారణం అయింది. ఉడికించిన కోడి గుడ్లను వెంటనే ఆపేయాలంటూ కొన్ని వర్గాలనుంచి డిమాండ్లు మొదలయ్యాయి. గుడ్లు తినడం తమ ఆచార సంప్రదాయాలకు వ్యతిరేకం అని వారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని, కోడిగుడ్ల బదులుగా ఇతర బలవర్ధక ఆహారాన్ని అందిస్తామంటూ విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ ప్రకటించారు. దీంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. గుడ్లు కావాల్సిందేనంటూ మరో వర్గం డిమాండ్లు మొదలు పెట్టింది. దీంతో కర్నాటక గుడ్డు రాజకీయ రంగు పులుముకుంది.

అసలెందుకీ వివాదం..?
అంగన్వాడీ పిల్లలకు కోడిగుడ్లను పంపిణీ చేసే విధానం కర్నాటకలో చాలా కాలం నుంచే ఉంది. అంగన్వాడీలకు వెళ్లే 3నుంచి ఆరేళ్ల లోపు పిల్లలకు వారంలో ఐదురోజులపాటు ఉడికించిన గుడ్లను ఇచ్చేవారు. ఆ పథకానికి ఎవరూ అడ్డు చెప్పలేదు, ఎవరూ కాదనలేదు. కానీ ఇప్పుడు దీన్ని పొడిగించడంతోనే అసలు సమస్య మొదలైంది. కర్నాటకలో 8 జిల్లాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా మొదలు పెట్టారు. 1నుంచి 8 ఏళ్ల లోపు పిల్లలకు మధ్యాహ్న భోజనంలో ఉడికించిన గుడ్లను అందిస్తున్నారు. ఇటీవల జరిపిన కుటుంబ ఆరోగ్య సర్వేలో కర్నాటకలోని 32.9 శాతం పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు తేలింది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

మఠాలనుంచి అభ్యంతరం..
ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ సహకారంతో నడిచే స్కూళ్లలో మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లను పంపిణీ చేయడం మొదలు పెట్టింది కర్నాటక ప్రభుత్వం. అయితే మఠాల అధీనంలో ఉండే స్కూళ్లనుంచి అభ్యంతరాలు వచ్చాయి. మఠాధిపతులనుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో ప్రభుత్వం వెంటనే పునరాలోచిస్తానంటూ చెప్పింది. అంతే కాదు, వెంటనే గుడ్లు పంపిణీ ఆపేయాలని ఆదేశిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ స్థానంలో మరో రకం పోషకాహారం ఇస్తామని ప్రకటించారు అధికారులు. దీంతో మరో వర్గం ఇప్పుడు ఒత్తిడి తెస్తోంది. చివరకు ప్రభుత్వం ఇరకాటంలో పడింది.

First Published:  21 Dec 2021 4:48 AM GMT
Next Story