Telugu Global
National

శశికళను క్షమించాలన్న పన్నీర్ సెల్వం.. సీనియర్ల గరంగరం..!

తమిళనాడులో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ జైలు పాలైన తర్వాత ఆ పార్టీ కో కన్వీనర్ ఎడప్పాడి పళనిస్వామి ఆధ్వర్యంలో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఆమె జైలు నుంచి విడుదలైన తరువాత పార్టీలోకి వచ్చేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అయితే అనూహ్యంగా అన్నాడీఎంకే కన్వీనర్ పన్నీర్ సెల్వం కొద్ది రోజుల కిందట శశికళను తిరిగి పార్టీలో చేర్చుకుంటామని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత […]

శశికళను క్షమించాలన్న పన్నీర్ సెల్వం.. సీనియర్ల గరంగరం..!
X

తమిళనాడులో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ జైలు పాలైన తర్వాత ఆ పార్టీ కో కన్వీనర్ ఎడప్పాడి పళనిస్వామి ఆధ్వర్యంలో ఆమెను పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఆమె జైలు నుంచి విడుదలైన తరువాత పార్టీలోకి వచ్చేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

అయితే అనూహ్యంగా అన్నాడీఎంకే కన్వీనర్ పన్నీర్ సెల్వం కొద్ది రోజుల కిందట శశికళను తిరిగి పార్టీలో చేర్చుకుంటామని ప్రకటించి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత పార్టీ సీనియర్ నాయకులంతా పన్నీర్ సెల్వం వ్యాఖ్యలను ఖండించడం తో ఆయన వెనక్కి తగ్గారు.

తాజాగా పన్నీర్ సెల్వం మరొకసారి శశికళకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఇవాళ చెన్నైలోని లిటిల్ సిస్టర్స్ వృద్ధాశ్రమంలో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పన్నీర్ సెల్వం, పళనిస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం మాట్లాడుతూ క్షమాగుణమే మంచి నాయకత్వానికి నిదర్శనమని చెప్పారు. చేసిన తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్తం కోరిన వారిని క్షమించాలని ఆయన అన్నారు. ఆయన శశికళను ఉద్దేశించి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారని భావించిన ఇతర సీనియర్ నేతలు అదే వేదికపై పన్నీర్ సెల్వంకు కౌంటర్ ఇచ్చారు.

మాజీమంత్రి జయకుమార్ మాట్లాడుతూ ‘ శశికళ లేకుండా అన్నాడీఎంకే పార్టీ బాగా నడుస్తోంది. ఆమెను క్షమించే ప్రసక్తే లేదు. పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్యలు శశికళకు వర్తించవు’ అని స్పష్టం చేశారు. కాగా జయకుమార్ కొద్దిరోజుల కిందట శశికళ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శశికళ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శినని ప్రచారం చేసుకుంటోందని, ఆమెకు అన్నాడీఎంకే పార్టీకి ఎటువంటి సంబంధం లేదని.. ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రస్తుతం పన్నీర్ సెల్వం వర్గం శశికళను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు సుముఖంగా ఉండగా, పళని స్వామి వర్గం మాత్రం వ్యతిరేకిస్తోంది.

First Published:  20 Dec 2021 8:50 AM GMT
Next Story