Telugu Global
National

బొమ్మైకి పొగపెట్టింది ఎవరు..? యడ్డీ హవా మళ్లీ మొదలవుతుందా..?

కర్నాటక అసెంబ్లీలో మరోసారి ముఖ్యమంత్రి కుర్చీ మారబోతోందా..? 15వ అసెంబ్లీ ఎవరికీ ఎక్కువరోజులు కలసి రావడంలేదా..? తాజా సీఎం బసవరాజ్ బొమ్మై కూడా తప్పుకోబోతున్నారా..? ఈ ప్రశ్నలిప్పుడు కర్నాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 2018 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం బలం లేకపోయినా సీఎం కుర్చీలో కూర్చున్న యడ్యూరప్ప ఆరు రోజులకే దిగిపోయారు. ఆ తర్వాత జేడీఎస్, కాంగ్రెస్ కాపురం మొదలైనా.. దాన్ని కూడా సజావుగా సాగనీయలేదు బీజేపీ. ఏడాది తిరిగేలోపు కుమారస్వామిని కుర్చీలోనుంచి […]

బొమ్మైకి పొగపెట్టింది ఎవరు..? యడ్డీ హవా మళ్లీ మొదలవుతుందా..?
X

కర్నాటక అసెంబ్లీలో మరోసారి ముఖ్యమంత్రి కుర్చీ మారబోతోందా..? 15వ అసెంబ్లీ ఎవరికీ ఎక్కువరోజులు కలసి రావడంలేదా..? తాజా సీఎం బసవరాజ్ బొమ్మై కూడా తప్పుకోబోతున్నారా..? ఈ ప్రశ్నలిప్పుడు కర్నాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 2018 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం బలం లేకపోయినా సీఎం కుర్చీలో కూర్చున్న యడ్యూరప్ప ఆరు రోజులకే దిగిపోయారు. ఆ తర్వాత జేడీఎస్, కాంగ్రెస్ కాపురం మొదలైనా.. దాన్ని కూడా సజావుగా సాగనీయలేదు బీజేపీ. ఏడాది తిరిగేలోపు కుమారస్వామిని కుర్చీలోనుంచి దించేశారు యడ్యూరప్ప. అయితే ఆ ఆనందం ఆయనకు రెండేళ్లకు మించి లేదు. ఈసారి అధిష్టానమే యడ్యూరప్పను పక్కన పెట్టింది. జులై 28న యడ్డీ వారసుడిగా బసవరాజ్ బొమ్మై ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. అయితే బొమ్మై కేబినెట్ లో యడ్డీ తనయుడు విజయేంద్రకు కీలక పదవులు లభిస్తాయని ఆశించినా ఫలితం లేదు. దీంతో పదవినుంచి దిగిపోయిన తర్వాత యడ్యూరప్పలో అసంతృప్తి మరింతగా పెరిగిపోయింది.

అరకొర మెజార్టీ ఉన్న కర్నాటకలో నెగ్గుకు రావడం బొమ్మైకి కుదిరేలా లేదు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో సీఎం సొంత జిల్లాలో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపొందడం సంచలనంగా మారింది. అప్పటి నుంచి యడ్డీ వర్గం బొమ్మైని మరింతగా టార్గెట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో బొమ్మై మార్పు వ్యవహారం తెరపైకి వచ్చింది. సీఎం తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారని, అత్యవసర చికిత్స మేరకు విదేశాలకు వెళ్తున్నారని, ఆలోపుగా కొత్త ముఖ్యమంత్రిని ప్రకటిస్తారని అంటున్నారు.

ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా ఇటీవల తన సొంత నియోజకవర్గంలో బొమ్మై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ సృష్టిలో ఏదీ శాశ్వ‌తం కాదని, ప‌ద‌వి కానీ, హోదా కానీ… ఇవేవీ శాశ్వ‌తం కావని, అసలు జీవితమే శాశ్వ‌తం కాదని బొమ్మై వేదాంతం మాట్లాడారు. ప్ర‌తి చిన్న విష‌యంలో తాను చాలా బహుప‌రాక్‌ గా ఉంటానని, ఆ విష‌యాల‌న్నీ తనకు తెలిసినవేనంటూ నర్మగర్భంగా మాట్లాడారు. తాను అనేక పద‌వులు నిర్వ‌హించినా, బ‌స‌వ‌రాజ్ బొమ్మైగానే ప్ర‌జ‌లంద‌రికీ గుర్తుండిపోతాన‌ని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ముఖ్య‌మంత్రి హోదాలో వ‌చ్చినా, ప్రజలలో ఒక‌డిగానే త‌న‌ను తాను భావించుకుంటాన‌ని, ప‌ద‌వులేవీ శాశ్వ‌తం కావ‌ని చెప్పారు.

మొత్తమ్మీద బొమ్మై వ్యాఖ్యలు, ఆయనపై జరిగిన ప్రచారం చూస్తుంటే.. కర్నాటకలో మరోసారి సీఎం మార్పు ఖాయమని అంటున్నారు. అయితే ఈసారి ఆ పదవి ఎవరికిస్తారనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. ప్రభుత్వంలో యడ్యూరప్ప హవా మళ్లీ మొదలవుతుందా..? లేదా కొత్త నాయకుడిని తెరపైకి తెస్తారా..? అనేది వేచి చూడాలి.

First Published:  19 Dec 2021 11:56 PM GMT
Next Story