Telugu Global
Cinema & Entertainment

దర్శకుడిగా మారిన రచయిత

రచయితలు దర్శకులుగా మారడం కొత్త కాదు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో రచయిత కూడా చేరుతున్నాడు. అతడే హర్షవర్థన్. నటుడిగా, రచయితగా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న హర్షవర్థన్, తొలిసారి డైరక్టర్ గా మారాడు. సుధీర్ బాబు కోసం ఒక భిన్న‌మైన క‌థ‌ను రెడీ చేశారు ద‌ర్శ‌కుడు హ‌ర్ష వ‌ర్ధ‌న్‌. ఈ సినిమాలో ఇంత వ‌ర‌కూ చూడ‌ని స‌రికొత్త అవతారంలో సుధీర్ బాబు క‌నిపించ‌నున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ రోజు హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో […]

దర్శకుడిగా మారిన రచయిత
X

రచయితలు దర్శకులుగా మారడం కొత్త కాదు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో రచయిత కూడా చేరుతున్నాడు. అతడే హర్షవర్థన్. నటుడిగా, రచయితగా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న హర్షవర్థన్, తొలిసారి డైరక్టర్ గా మారాడు.

సుధీర్ బాబు కోసం ఒక భిన్న‌మైన క‌థ‌ను రెడీ చేశారు ద‌ర్శ‌కుడు హ‌ర్ష వ‌ర్ధ‌న్‌. ఈ సినిమాలో ఇంత వ‌ర‌కూ చూడ‌ని స‌రికొత్త అవతారంలో సుధీర్ బాబు క‌నిపించ‌నున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ రోజు హైద‌రాబాద్‌లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది.

ముహూర్త‌పు షాట్‌కు నిర్మాత పుస్కుర్‌ రామ్‌మోహ‌న్ రావు క్లాప్ కొట్టి స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌కుడికి అంద‌జేశారు. వ‌చ్చే వారం నుండి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

సుధీర్ బాబు కెరీర్ లో 15వ సినిమా ఇది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ప‌తాకంపై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా పేరు పెట్ట‌ని ఈ చిత్రానికి చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీత దర్శకుడు. పీజీ విందా సినిమాటోగ్రాఫర్.

First Published:  20 Dec 2021 7:41 AM GMT
Next Story