Telugu Global
NEWS

జీవో నెంబర్ 35 అన్ని థియేటర్లకూ వర్తిస్తుంది.. హైకోర్టు క్లారిటీ..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల థియేటర్లలో టికెట్ రేట్లను తగ్గిస్తూ జీవో నెంబర్ 35ను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే టికెట్ ధరల తగ్గింపుపై కొందరు డిస్ట్రిబ్యూటర్లు, సినిమా థియేటర్ల యజమానులు హైకోర్టుకు వెళ్లారు. కొద్దిరోజుల కిందట ఈ కేసును విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి సినిమా విడుదల సమయంలో టికెట్ రేట్ పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ తీర్పు చెప్పారు. జీవో నంబర్ 35ను రద్దు చేశారు. సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం […]

జీవో నెంబర్ 35 అన్ని థియేటర్లకూ వర్తిస్తుంది.. హైకోర్టు క్లారిటీ..!
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల థియేటర్లలో టికెట్ రేట్లను తగ్గిస్తూ జీవో నెంబర్ 35ను జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే టికెట్ ధరల తగ్గింపుపై కొందరు డిస్ట్రిబ్యూటర్లు, సినిమా థియేటర్ల యజమానులు హైకోర్టుకు వెళ్లారు. కొద్దిరోజుల కిందట ఈ కేసును విచారించిన హైకోర్టు సింగిల్ జడ్జి సినిమా విడుదల సమయంలో టికెట్ రేట్ పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ తీర్పు చెప్పారు. జీవో నంబర్ 35ను రద్దు చేశారు.

సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. అయితే ఆ లోగా థియేటర్ల యాజమాన్యాలు ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్ల అనుమతి తీసుకొని టికెట్ ధరలు పెంచుకోవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో అన్ని జిల్లాల్లోని థియేటర్ల యజమానులు జాయింట్ కలెక్టర్లకు టికెట్ ధరలపై ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధమయ్యారు.

ఆలోగా రాష్ట్ర హోమ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఈ తీర్పు కేవలం కోర్టును ఆశ్రయించిన థియేటర్ల యజమానులకు మాత్రమే వర్తిస్తుందని ఆదేశాలు ఇచ్చారు. దీంతో గందరగోళం ఏర్పడింది. ఈ అంశం పై హైకోర్టు ఇవాళ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. టికెట్ల ధరల నియంత్రణపై జీవో నెంబర్ 35 రద్దు అందరికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు.

కాగా టిక్కెట్ల ధరల ఇష్యూ హైకోర్టులో ఉండగానే ప్రభుత్వం ఆదివారం మరో జీవోను తీసుకొచ్చింది. సినిమా టిక్కెట్ల అమ్మకాలు ప్రభుత్వ నియంత్రణలో ఆన్లైన్లోనే జరిగేలా జీవో నెంబర్ 142ను తెచ్చింది. టిక్కెట్ల అమ్మకాల బాధ్యతను ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ప్రభుత్వం అప్పగించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ కూడా ఏర్పాటు చేయబోతోంది.

First Published:  20 Dec 2021 9:27 AM GMT
Next Story